Paddy Procurement Centres: తమ ప్రభుత్వ హయాంలో ప్రతి గింజ కొనుగోలు చేసి.. ఠంచన్‌గా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీమంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కానీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. కల్లాల్లో ధాన్యం వర్షాలకు తడుస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల వడ్లు వద్దా రేవంత్‌ రెడ్డి అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రైతులంతా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉద్యమం చేస్తుంటే రేవంత్‌ దుర్మార్గంగా అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ponguleti: పొంగులేటి మరో సంచలన ప్రకటన.. తెలంగాణకు రెండో రాజధాని వరంగల్


 


సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం మాజీ మంత్రి హరీశ్‌ రావు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు విషయాన్ని ఆరా తీశారు. తమకు రైతు బంధు, రుణమాఫీ కాలేదని రైతులు హరీశ్‌ రావు ముందు వాపోయారు. అనంతరం మీడియాతో సీనియర్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు మాట్లాడారు. 'రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు దక్కడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: KTR Padayatra: ప్రజాక్షేత్రంలోకి కేటీఆర్‌.. పాదయాత్ర చేసేది అక్కడి నుంచే!


కేసీఆర్ హయాంలో వడ్లు కల్లాలకు రాకముందే సంచులు పంపించి.. మిల్లులతో ఒప్పందం చేయించి, రవాణా ఏర్పాటు చేసి మరీ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేశారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ.. రేవంత్ ప్రభుత్వం నెలరోజులైనా వడ్లు కొనుగోలు చేయడం లేదని చెప్పారు. 'కోతులు, పందికొక్కులు వడ్లను నాశనం చేస్తున్నాయి. రైతులంతా ఇంటికి వెళ్లకుండా కల్లాల కాడా కాపలా కాస్తున్నారు' అని వివరించారు. 'ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి రైతుల మద్దతు కోరాడు. కానీ ఇప్పుడు వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు' అని మండిపడ్డారు.

'జగిత్యాల జిల్లా, మహబూబాబాద్, సూర్యాపేట, రాజన్న సిరిసిల్లలో రైతులంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి రైతులను రోడ్డుపై పడేశాడు. రైతుల ఓట్లు కావాలి కానీ, రైతుల వడ్లు పట్టవా రేవంత్‌రెడ్డి' అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్‌ రావు నిలదీశారు. రేవంత్ రెడ్డి ఒక్కరోజైనా వడ్ల కొనుగోలుపై రివ్యూ చేపట్టావా? అని ప్రశ్నించారు. ఓట్లప్పుడు ఊరురా తిరిగిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు రైతుల దగ్గరికి వెళ్లట్లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల బాధలు.. కష్టాలు తెలుసుకో అని రేవంత్‌ రెడ్డికి సూచించారు.


'వడ్ల కొనుగోలు జరుగుతున్నాయా? లేదా? అని రేవంత్‌ రెడ్డి, అతడి మంత్రులు ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. కేసీఆర్ రైతుబంధు ఏడాదికి రెండు సార్లు ఇస్తే.. మూడుసార్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిండు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా ఇవ్వలేదు' అని సీనియర్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి రైతుల ఉసురుపోసుకుంటుండు అని శాపనార్థాలు పెట్టారు. 'రైతులకు గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు ఇచ్చే తెలివి కూడా రేవంత్ రెడ్డికి లేదు. సీఎం, మంత్రులు హైదరాబాద్‌ను వదిలి కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలి. రైతులకు మద్ధతు ధర ఇవ్వాలి. రూ.500 బోనస్ ఇవ్వాలి' అని హరీశ్ రావు డిమాండ్‌ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.