KTR Vs Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. "సోనియా గాంధీని దెయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది.. దొడ్డి దారిన  పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలురంగు అందరికీ తెలుసు. నీ ఆలోచనల్లో  కుసంస్కారం.. నీ మాటలు  అష్ట వికారం.. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా..? తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన  నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే.. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది. మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ల బొమ్మలను తొలగిస్తాం.. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం.." అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MP Mopidevi Venkata Ramana: జగన్‌కు అత్యంత సన్నిహితుడు బిగ్‌ షాక్.. టీడీపీలోకి ఎంపీ మోపిదేవి జంప్..!  


అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి స‌చివాలయ ప్రాంగ‌ణంలో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. డిసెంబ‌రు 9వ తేదీన తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఘ‌నంగా ఆవిష్కరిస్తామన్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేద‌ని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించార‌ని.. సోనియా గాంధీ 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష‌ను నెర‌వేర్చార‌ని గుర్తు చేశారు. 2014 నుంచి 2024 వ‌ర‌కు ప‌దేళ్లు తెలంగాణ‌ను పాలించిన వారు ఎన్నెన్నో నిర్మించామ‌ని గొప్పలు చెప్పుకుని.. తెలంగాణ తల్లిని తెరమరుగు చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని విమర్శించారు.


పదేళ్లుగా ముఖ్యమంత్రిగా, మంత్రులుగా పనిచేసిన వారు సచివాలయంలోకి ప్రజలను రానివ్వలేదని.. తమ ప్రభుత్వంలో అందరికీ ప్రవేశం ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. ప్రజలు ఇక్కడికి వచ్చి తమ సమస్యలు చెప్పుకొవచ్చన్నారు. స‌చివాల‌యం ఎదుట స్థలాన్ని త‌మ స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం కొంద‌రు ఉంచుకోవాల‌ని భావించార‌ని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మేధావుల సూచన మేరకే అక్క‌డ‌ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తోందన్నారు.


Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.