Ex Minister KTR: హైడ్రాపై కేటీఆర్ సంచలన కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్
KTR Comments on HYDRA: కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని హైదరాబాద్‌పై రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రాతో నగరంలో పేదోళ్ల ఇళ్లు కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. బఫర్ జోన్‌లో ఉన్న సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు.
KTR Comments on HYDRA: హైదరాబాద్‌లో సంచనలనం రేపుతున్న హైడ్రాపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేదవాళ్ల బతుకులను రోడ్డుపై వేస్తున్నారని.. గరీబోళ్లకు ఒక న్యాయం.. సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఒక న్యాయమా..? అని నిలదీశారు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణలో భవన్‌లో శేరిలింగంపల్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే తప్పకుండా శేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందని జోస్యం చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివితో మాట్లాడుతున్నాడని.. శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మీవోడే అంటున్నాడని.. గాంధీకి కండవా కప్పిన సన్యాసి ఎవరు మరి శ్రీధర్ బాబు అని అడిగారు. తమ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న సన్యాసి ఎవరో చెప్పాలన్నారు. అక్కలని నమ్ముకుంటే తన బతుకు జూబ్లీ బస్టాండ్ అవుతుందని నిండు అసెంబ్లీలో అక్కలని అవమానించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: AP Nominated Posts: ఏపీలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. సామాన్య కార్యకర్తలకు కీలక పదవీ..
హైదరాబాద్ నగరం వాళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని సీఎం రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నాడు. అందుకే హైడ్రా పేరుతో పెదోళ్ల ఇండ్లు కూల్చుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్‌లో ఉంది. ఆయన ఇల్లు ఎందుకు కూల్చరు..? తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, పేదోళ్లకు ఒక న్యాయమా..? మదాపూర్ కావూరి హిల్స్‌లో తిరుపతి రెడ్డి ఇల్లు ఉంటుంది. మాదాపూర్ కావూరి హిల్స్ సెటిల్‌మెంట్లకు అడ్డా. FTL, బఫర్ జోన్‌లో ఇండ్లకుపర్మిషన్ ఇచ్చిన వారినీ జైళ్లో పెట్టు రేవంత్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టరు.
వాళ్లవి కూల్చకుండా పేదోళ్ల ఇండ్లపై పడి కూల్చుతున్నారు. ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పేదోళ్ల ఇండ్లు కూల్చుతున్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా పర్మిషన్ ఇచ్చిందే మీ కాంగ్రెస్ కాదా..? పేదవాళ్ల ఇళ్లను కూల్చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదు. వారికి అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని పంచుకొని స్వైర విహారం చేస్తూ దోచుకుంటున్నారు. గరీబోళ్లు పుస్తకాలు, సామాన్లు తీసుకుంటామంటే కూడా వారికి సమయం ఇవ్వటం లేదు. బిల్డింగ్లు నిర్ధాక్షణ్యంగా కూల్చేస్తారు. మనం కన్ స్ట్రక్షన్ చేశాం. ఈయన మాత్రం డిస్ట్రక్షన్ చేస్తుండు. మనం డబుల్ బెడ్ రూమ్‌లు, ఫ్లై ఓవర్లు, ఎస్టీపీలు కట్టినం. ఈ ముఖ్యమంత్రి మాత్రం 9 నెలల్లో బెదిరింపులు, కూలగొట్టుడు, బ్లాక్ మెయిలు చేస్తున్నాడు. నాగార్జునకు సంబంధించిన నిర్మాణాన్ని కూల్చేశారు మంచిదే. కానీ పర్మిషన్ ఇచ్చిందెవడు..? ఎవ్వడు పర్మిషన్ ఇచ్చిండు వాళ్లపై చర్యలు తీసుకో దమ్ముంటే.. పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్సే. మనం ఆక్రమణలను ప్రోత్సహించామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు పర్మిషన్లు ఇచ్చినోళ్లను బయటకు తీయండి. అవన్నీ మీ కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన పర్మిషన్లే.
పేదవాళ్లకు ఎవరు అండగా లేరని వారిపై దౌర్జన్యం చేస్తారా..? పేదవాళ్లే దిక్కులేక ఎక్కడైనా నాలాలపై ఇళ్లు కట్టుకుంటారు. మానవత్వం ఉన్న ప్రభుత్వమైతే వాళ్లకు నోటీసులు ఇవ్వలే. లేదంటే వాళ్లకు వేరే ఇళ్లు ఇవ్వాలే. నీకు నీతి ఏమైనా ఉందా..? మేము కట్టిన 40 వేల డబుల్ బెడ్ రూమ్‌లు ఉన్నాయి. నీకు చిత్తశుద్ది ఉంటే ఆ ఇళ్లను పేదవాళ్లకు ముందు ఇవ్వు. మా కన్నా ఎక్కువ పనులు చేసి ప్రజలకు మంచి చెయ్యి. లేదంటే మేము ఊరుకోం.." అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. చిట్టి నాయుడు అన్నదమ్ముళ్లు ఏడుగురు మొత్తం తెలంగాణను పంచుకున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి బంధువులు, సీఎం చేస్తున్న దౌర్జన్యాలతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందన్నారు.
Also Read: Rhea singha: గుజరాత్ భామను వరించిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.