Ex mp passes away: హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య ( Nandi Yellaiah ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నంది ఎల్లయ్య జూలై 29న నిమ్స్‌లో  చేరారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. వైరస్ ( Coronavirus ) సోకినట్లు గుర్తించారు. మరలా ఆయనకు మళ్లీ పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్ వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. ఆయన తీవ్ర అనారోగ్యంతో శనివారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  Also read: Telangana: మరో ఎమ్మెల్యేకు కరోనా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నంది ఎల్లయ్య లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందారు. రాజ్యసభ సభ్యుడిగా.. ఎమ్మెల్సీగా కూడా ఆయన సేవలందించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం తెలియజేయడంతోపాటు.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. Also read: Mahesh Babu: ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తిAlso read: Mahesh Babu: ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ విజ్ఞప్తి


సీఎం కేసీఆర్ సంతాపం..
ఇదిలాఉంటే.. నంది ఎల్లయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) కూడా సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.  
 Also read: India: 20లక్షలు దాటిన కరోనా కేసులు