Prathyusha Garimella: హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష బలవన్మరణం..కారణాలు ఇవేనా..!
Prathyusha Garimella: సెలబ్రెటీల ఆత్మహత్యలు సర్వసాధారణంగా మారుతున్నాయి. బతుకు భారమై తనువు చాలిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకుంది.
Prathyusha Garimella: హైదరాబాద్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంట్లోనే ఆమె విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్రత్యూష నివాసముంటోంది. మృతదేహం పక్కన కార్బన్ మోనాక్సైజ్ సీసాను పోలీసులు గుర్తించారు. బాత్‌రూమ్‌లో కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ..అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్లు ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది. ఇంట్లో నుంచి ప్రత్యూష బయటకు రాకపోవడంతో లోపలికి వెళ్లినట్లు వాచ్‌మెన్ తెలిపాడు. బాత్‌రూమ్‌లో పడి ఉండటాన్ని గుర్తించినట్లు పోలీసులకు వివరించారు.
ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఏమైనా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా..వృత్తి పరంగా ఒత్తిళ్లు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత దీనిపై క్లారిటీ రానుంది. ప్రముఖ హీరోయిన్లు విద్యా బాలన్, శృతి హాన్, జాక్వెలిన్, పరిణితి చోప్రా, కాజోల్ దేవగన్, క్రీడాకారిణి సానియా మీర్జాతోపాటు ఇతర ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసింది.
ఘటనాస్థలిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులకు భారం కాకూదని సూసైడ్ చేసుకుంటున్నా..నన్ను క్షమించండి అంటూ అందులో పేర్కొంది. తాను కోరుకున్న జీవితం ఇది కాదని తెలిపింది.
Also read: Mamata letter to oppositions: మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!
Also read:Babar Azam New Record: సూపర్ ఫామ్‌లో పాకిస్థాన్ సారధి బాబర్ ఆజాం..తాజాగా మరో రికార్డు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి