Bandi Sanjay: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో గంటకో ట్విస్ట్ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్ట పర్యటన హై టెన్షన్ రేపుతోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి సీఎం కేసీఆర్ కు గురువారం సవాల్ విసిరారు బండి సంజయ్. యాదాద్రిలో ప్రమాణం చేయడానికి రావాలని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బిజెపి యట్నించిందన్న టిఆర్ఎస్ ఆరోపణలపై సంజయ్ సీఎం కు ఛాలెంజ్ చేశారు. కుట్రతో సంబంధం లేకుంటే యాదగిరిగుట్టకు వచ్చి ప్రమాణం చేయాలని, కెసిఆర్ కోసం యాదాద్రి ఆలయం వద్ద వచ్చి చూస్తారని బండి స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు  బండి సంజయ్ పర్యటనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. పోలీసులు అడ్డుకున్నా వెళ్లి తీరుతానంటున్నారు బండి సంజయ్. దీంతో సంజయ్ యాదాద్రి పర్యటన రచ్చగా మారింది.  మునుగోడు నియోజకవర్గం దాటగానే బండి సంజయ్ ను అరెస్టు చేసేందుకు భారీగా పోలీసులు మోహరించారు. మర్రిగూడ క్యాం్ప ఆఫీసు నుంచి యాదాద్రికి బయలు దేరే ముందు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా యాదాద్రిలో ప్రమాణం చేస్తానని  చెప్పారు. యాదాద్రిలో ప్రమాణం చేసి తమ నిజాయితీ నిరూపించుకుంటామని తెలిపారు. ఎవరు అడ్డుకున్నా యాదాద్రి వెళ్లి తీరుతానని బండి సంజయ్ స్పష్టం చేశారు.


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి వస్తుండటంతో అతన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. గో బ్యాక్ బండి సంజయ్ అనే ఫ్లెక్సీతో భారీ ర్యాలీ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు యాదాద్రిలో ర్యాలీ తీశాయి.డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు యాదాద్రిలో నిరసన తెలుపుతున్నారు.


Read Also: Pawan Kalyan: అన్నను చూసి కూడా అర్ధం చేసుకోని పవన్.. మరో తప్పు చేసేందుకు రెడీ?


Read Also: Chandra Grahan 2022: దేవ్ దీపావళి రోజునే చంద్రగ్రహణం, భారతదేశంపై దీని ప్రభావం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి