Desinger Prathyusha Suicide Case: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (36) ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 10 రోజుల ముందుగానే ప్రత్యూష ఆత్మహత్యకు ప్లాన్ చేసుకున్నట్లు పోలీసుల తాజా దర్యాప్తులో వెల్లడైంది. నొప్పి లేకుండా సునాయాసంగా ప్రాణాలు వదలడం ఎలా అని ఇంటర్నెట్‌లో ప్రత్యూష సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొద్ది వారాల పాటు దీనిపై ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన ప్రత్యూష.. చివరకు కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. గాలి బయటకు వెళ్లని వాష్‌రూమ్‌లో చార్‌కోల్‌ను మండించడం ద్వారా విడుదలైన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే ప్రత్యూష చనిపోయినట్లు తేల్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయాల ప్రకారం.. ఆత్మహత్యకు 10 రోజుల ముందు ప్రత్యూష తన బొటిక్‌కి ఒక కార్పెంటర్‌ను పిలిపించారు. అతనితో వాష్‌రూమ్‌లోని కిటికీ, వెంటిలేటర్‌ను తొలగించారు. కిటికీ, వెంటిలేటర్ ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. దీంతో వాష్‌రూమ్‌ పూర్తిగా ఎయిర్ టైట్‌గా మారిపోయింది. ఇదే వాష్ రూమ్‌లో ప్రత్యూష కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడింది. ముందస్తు ప్లాన్‌తోనే ప్రత్యూష వాష్‌రూమ్ కిటికీ, వెంటిలేటర్ మూసివేయించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ప్రత్యూష నిర్వహిస్తున్న బొటిక్‌లో చార్‌కోల్ ఇదివరకే ఉందా.. లేక ఆత్మహత్య కోసమే ఆమె దాన్ని కొనుగోలు చేసిందా అన్నది తెలియాల్సి ఉంది. బొటిక్‌లో దొరికిన సూసైడ్ నోట్‌ కాక ఆమె పెన్ డ్రైవ్‌లో మరింత క్లుప్తంగా మరో సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ నోట్‌ను విశ్లేషిస్తున్నారు. డిప్రెషన్, ఒంటరితనం వల్లే ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 


బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో తాను నిర్వహిస్తున్న బొటిక్‌లో ప్రత్యూష శుక్రవారం (జూన్ 10) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బొటిక్‌కి వెళ్లిన ప్రత్యూష ఇంటికి తిరిగిరాకపోవడం, ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అక్కడికి వెళ్లారు. అక్కడి సెక్యూరిటీని ఆరా తీయగా మేడమ్ రాత్రి నుంచి లోపలే పడుకుని ఉన్నారని.. బయటకు రాలేదని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా.. ప్రత్యూష వాష్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. 


Also Read: Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 40 మందికి గాయాలు 


Also Read: National Herald Case: నేడు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. ఢిల్లీలో నిరసన ర్యాలీకి కాంగ్రెస్ ప్లాన్..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.