Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 40 మందికి గాయాలు

Road Accident in Alluri Sitharama District: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2022, 08:21 AM IST
  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి
  • మరో 40 మందికి గాయాలు... మృతుల్లో ఇద్దరు చిన్నారులు
Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 40 మందికి గాయాలు

Road Accident in Alluri Sitharamaraju District: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. చింతూరు మండలంలోని ఏడుగుర్రాళ్లపల్లిలో సోమవారం (జూన్ 13) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలోని భవానీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులను గుర్తించారు. గాయపడినవారిని ఏడుగుర్రాళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులను ఒడిశాకి చెందినవారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఏడుగుర్రాళ్లపల్లి మూలమలుపు వద్ద బస్సు బోల్తా కొట్టిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

కాగా, ఇటీవలి కాలంలో ఏపీలో తరచుగా రోడ్డు ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత మే నెలలో పల్నాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. టాటా ఏస్ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అంతకుముందు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు కొద్దిరోజుల ముందు అన్నమయ్య జిల్లాలో ఓ కారు కల్వర్టును ఢీకొట్టిన ఘటనలు ఇద్దరు పిల్లలు, భార్యాభర్తలు మృతి చెందారు. తాజాగా అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇలా వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: National Herald Case: నేడు ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. ఢిల్లీలో నిరసన ర్యాలీకి కాంగ్రెస్ ప్లాన్..  

Also Read: Monsoon: తెలంగాణలో ఇక వానలే వానలు.. ఇవాళే రాష్ట్రంలోకి రుతుపవనాల ఎంట్రీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News