Doctor Sultana Detained By Private Hospital staff | హైదరాబాద్: కరోనా చికిత్సకు అవుతున్న బిల్లులతో సామాన్యులు బెంబెలెత్తుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌ను తలుచుకుంటేనే వణికిపోతున్నారు. ఈ కష్టాలు డాక్టర్లకు సైతం తప్పడం లేదు. తనకు ఒక్కరోజు ట్రీట్‌మెంట్‌కు లక్ష బిల్లు ఎలా వేశారని ప్రశ్నించిన లేడీ డాక్టర్‌ను ఆ హాస్పిటల్ యాజమాన్యం నిర్బంధించింది. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. డాక్టర్ల పరిస్థితి అలా ఉంటే సామాన్యుల మాటేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. బాధ్యత ఉండక్కర్లేదా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫీవర్ ఆస్పత్రిలో డీఎంవో అయిన డాక్టర్ సుల్తానా (Fever Hospital Doctor Sultana)కు ఈ నెల ఒకటో తేదీన కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో చికిత్స కోసం ఛాదర్‌ఘాట్‌లోని తుంబే ప్రైవేట్ ఆసుపత్రిలో సుల్తానా చేరారు. ఆమెతో పాటు సోదరి కూడా ఉన్నారు. అయితే ఒక్కరోజు చికిత్సకు రూ.1.15 లక్షల బిల్లు వేశారు. తాను డాక్టర్‌నని అయినా 24 గంటల చికిత్సకు లక్షల్లో బిల్లు వేయడం ఏంటని తుంబే హాస్పిటల్ యాజమాన్యాన్ని డాక్టర్ సుల్తానా ప్రశ్నించారు. ఢిల్లీలో ఇళ్లల్లోనే కోలుకుంటున్నారు: కేజ్రీవాల్


ఈ క్రమంలో డాక్టర్ సుల్తానా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. బిల్లు గురించి ప్రశ్నిస్తే తుంబే ఆసుపత్రి యాజమాన్యం తనను బంధించిందని సుల్తానా ఆరోపించారు. ఒక్కరోజుకే లక్షకు పైగా బిల్లు వేశారని, ప్రశ్నించినందుకు తనను బంధించడంతో పాటు సరైన చికిత్స అందించడం లేదని ఆమె పేర్కొన్నారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos 


ఈ ఘటనపై ఫీవర్ ఆస్పత్రి (Fever Hospital) సూపరింటెండెంట్ శంకర్‌ను మీడియా సంప్రదించింది. సుల్తానా తమ ఆసుపత్రిలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా సేవలందిస్తున్నారని, అయితే ఇటీవల ఆమెకు కోవిడ్19 పాజిటివ్‌ వచ్చిందన్నరు. అయితే ఆసుపత్రి యాజమాన్యానికి ఏ విషయం చెప్పకుండా వేరే ఆసుపత్రిలో చేరారని తెలిపారు. తమకు చెబితే ఫీవర్ ఆస్పత్రిలోనే డాక్టర్ సుల్తానాకు మెరుగైన వైద్యం అందించేవాళ్లమని చెప్పారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!