Arvind Kejriwal | ఢిల్లీలో కరోనా వైరస్ ( coronavirus ) బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఎక్కువ మంది బాధితులు ఇళ్లల్లోనే కోలుకుంటున్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన దాదాపు 10,000 బెడ్లు ఖాళీగా ఉన్నాయని కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు. గత వారం నుంచి ప్రతిరోజూ సగటున 2,300 మంది కొత్త కరోనా రోగులను గుర్తించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య మాత్రం 6,200 నుంచి 5,300 కు తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు 9,900 కరోనా బెడ్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులను అభినందించారు. Also read: కరోనా శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. బాధ్యత ఉండక్కర్లేదా?
లక్షకు చేరువలో కేసులు..
ఢిల్లీ ఆరోగ్య శాఖ (delhi health ministry) ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శనివారం 2,505 కరోనా కేసులు నమోదు కాగా.. 55మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,200 కు పెరగగా.. మరణాల సంఖ్య 3,004కు చేరుకుంది. అలాగే నిన్న ఒక్కరోజే దాదాపు 2,500మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 68,256కు చేరింది. కాగా ఇంకా 25,940మంది చికిత్స పొందుతున్నారు. Also read: భారత్‌లో రికార్డు కరోనా కేసులు.. ఒక్కరోజులో 613 మరణాలు
70శాతం దాటిన రికవరీ రేటు..
ఇదిలాఉంటే ఢిల్లీలో రికవరీ రేటు 70 శాతం దాటిందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 60.81 శాతంగా ఉంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!
ఢిల్లీలో ఇళ్లల్లోనే కోలుకుంటున్నారు: కేజ్రీవాల్