FIR filed against Bholakpur Corporator Mohammed Ghousuddin for abusing cops: ఖాకీలపై వీరంగం వేసిన భోలక్‌పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ మొహ్మద్ గౌసుద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జీ న్యూస్‌లో కథనం ప్రసారం కావడంతో పోలీసు అధికారులు స్పందించారు. విహాయంలోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్‌పూర్‌లో దుకాణాలు మూసేయాల్సిందిగా స్థానిక పోలీసులు యజమానులను కోరారు. రంజాన్‌ సందర్భంగా షాపులు తెరుచుకున్నామంటూ కొందరు దుకాణదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌.. తన ఇలాకాలో పోలీసులు అడుగు పెట్టొద్దని హుకుం జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్ధరాత్రి పదుల సంఖ్యలో అనుచరులను వెంటేసుకుని తిరుగుతూ.. సదరు కార్పొరేటర్‌ పోలీసులపై వీరంగం వేశారు. దుకాణాలను మూసివేయించేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారు. అంతేకాకుండా పోలీసులపై దుర్భాషలాడారు. పోలీసులు వంద రూపాయల మనుషులే అంటూ అవహేళన చేస్తూ మాట్లాడారు. రంజాన్ మాసంలో రాత్రంతా విచ్చల విడిగా తిరుగుతాం.. నగరమంతా ఎక్కడైనా మాకు తినే పదార్థాలు ఉండాలంటూ పోలీసులతో అన్నారు భోలక్‌పూర్‌ కార్పొరేటర్. గతంలో ఓ లేడీ ఎస్ఐపై ఈ కార్పొరేటరే దురుసుగా వ్యవహరించాడు. అప్పుడు అతనిపై ఏం చర్యలు తీసుకోలేదు. కానీ తాజా వ్యవహారంపై జీ న్యూస్ కథనం వైరల్ కావడంతో పోలీసు శాఖ స్పందించింది.



పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏ పార్టీకి చెందిన వారైనా ఇలాంటి చెత్తను సహించబోమని మంత్రి పేర్కొన్నారు.  ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ ఆదేశించారు. ఎవరైనా సరే  పోలీసులను గౌవించాల్సిందేనని తేల్చి చెప్పారు. కేటీఆర్ ట్వీట్ నేపథ్యంలో ముషిరాబాద్ పోలీసులు ఎంఐఎం కార్పొరేటర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 353, 506 కింద కేసు పెట్టారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసు శాఖ ట్వీట్ చేసింది. 


Also Read: CNG Price: ఆటోవాలాకు షాక్​.. పెట్రోల్, డీజిల్​తో పోటీగా పెరుగుతున్న సీఎన్​జీ ధరలు


Also Read: 26 Districts in AP: 26 జిల్లాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర.. ఏప్రిల్ 4 న కొత్త జిల్లాల అవతరణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook