Fire accident at Korutla TRS MLA's house : జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎమ్మెల్యే సతీమణి సరోజా స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంక్రాంతి పండగ నేపథ్యంలో మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే ఇంట్లో భార్య, కుటుంబ సభ్యులు కలిసి పిండి వంటలు చేస్తుండగా ప్రమాదం జరిగింది. గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సతీమణికి స్వల్ప గాయాలు మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


కాగా, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు (TRS MLA) గత నెలలో అయ్యప్ప మాలధారణ స్వీకరించారు. మెట్‌పల్లిలోని స్థానిక అయ్యప్ప దేవాలయంలో (Temple) మాల ధరించారు. 34వ సారి ఆయన మాలధారణ స్వీకరించడం గమనార్హం.


Also Read: Omicron Wave: వచ్చే నెలలో భారత్‌లో కరోనా పీక్స్‌కి.. డెల్టా పీక్‌ని మించి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook