Stampede: వైష్ణవదేవి ఆలయంలో భారీగా తొక్కిసలాట, 13 మంది మృతి

నూతన సంవత్సరాది తీవ్ర విషాదం మిగిల్చింది. జమ్ము కశ్మీర్ వైష్ణవదేవీ ఆలయంలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో ఆందోళన చెలరేగి..తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందుతోంది.

Stampede: నూతన సంవత్సరాది తీవ్ర విషాదం మిగిల్చింది. జమ్ము కశ్మీర్ వైష్ణవదేవీ ఆలయంలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో ఆందోళన చెలరేగి..తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందుతోంది.
 

1 /5

వైష్ణవదేవీ ఆలయం యాత్రను ప్రమాదం నేపధ్యంలో కాస్సేపు నిలిపివేసి..తిరిగి ప్రారంభించారు. భక్తుల కోసం మరోసారి రిజిస్ట్రేషన్ ప్రారంభించారు.   

2 /5

సహాయక, ఇతర సమాచారం కోసం 01991-234804, 01991-234053 నెంబర్లను ప్రకటించారు వీటితో పాటు కొన్ని హెల్ప్‌లైన్ నెంబర్ విడుదల చేశారు.   

3 /5

వైష్ణవదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై దర్యాప్తుకు ఆదేశించారు. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ ఈ ప్రమాదం గురించి అధికారికంగా వెల్లడించారు.   

4 /5

ప్రధానమంత్రి సహాయ విపత్తు కింద మృతులకు 2 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. అటు జమ్ము కశ్మీర్ రాష్ట్రం తరపున మృతులకు పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు.   

5 /5

ఇవాళ తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఏ విధమైన అనుమతుల్లేకుండానే భక్తులు పోటెత్తారు.