Rahul Gandhi: రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లలో అపశ్రుతి.. భద్రత ఏర్పాట్లపై నేతల అనుమానాలు
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కోసం చేసిన ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతోంది. కర్ణాటక నుంచి మహబూబ్ నగర్ సరిహద్దుల ద్వారా తెలంగాణలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఆదివారం నాటి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రన్నింగ్ రేసులో పాల్గొనడం చూశాం. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఇక ఇదిలావుంటే, కొత్తూరు మండల కేంద్రంలోని పేపర్ స్పోర్ట్ వద్ద రాహుల్ గాంధీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఒక 125 కేవీ, మరొక 62 కెవి జనరేటర్ దగ్ధం అయ్యాయి. మంటలు పక్కలకు వ్యాపించడంతో అక్కడే పార్క్ చేసి ఉన్న మరో రెండు డీసీఎం వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందుకున్న మహేశ్వరం అగ్నిమాపక శాఖ అధికారి రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే రెండు జనరేటర్లు, రెండు డీసీఎం వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. సాంకేతిక కారణాల లోపంతోనే ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని రమేష్ తెలిపారు. అదృష్టవశాత్తుగా ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హానీ జరగలేదని రమేష్ స్పష్టం చేశారు.
అయితే, ఇంత పెద్ద ఘటన జరిగి రెండు జనరేటర్లు, రెండు భారీ వాహనాలు మంటల్లో తగలబడిపోయినప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం స్పందించలేదని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. బందోబస్తు అంతంత మాత్రంగానే ఉండడంతో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి 100 డయల్ చేయడంతో ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్ ఘటనా స్థలికి వచ్చి వివరాలు తీసుకున్నారని... అంతకుమించి ఉన్నతాధికారులు ఎవరు సంఘటన స్థలానికి రాలేదని నేతలు మీడియాకు తెలిపారు. వచ్చేది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనప్పటికీ.. ఇక్కడ రాహుల్ గాంధీ సభకు ( Rahul Gandhi ) బందోబస్తు ఏర్పాట్లు, పర్యవేక్షణ కనిపించడం లేదని స్థానిక కాంగ్రెస్ నేతలు వాపోయారు.
Also Read : Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు.. 24 గంటలే డెడ్‌లైన్
Also Read : Rahul Gandhi Bharath Jodo Yatra: రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ రన్నింగ్ రేస్.. ఎవరు గెలిచారంటే..?
Also Read : Munugode Bypoll: ఒక్కో అకౌంట్ కు 15 నుంచి 50 లక్షలు... మునుగోడు ఓటర్లరా మీకు డబ్బులు వచ్చాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి