Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు.. 24 గంటలే డెడ్‌లైన్

Komatireddy Rajagopal Reddy Gets EC Notice: మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేస్తోన్న బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్ ఇచ్చింది. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను ప్రలోభపెట్టడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 5 కోట్లకుపైగా మొత్తాన్ని సొంత కంపెనీ ఖాతా నుంచి నిధులు మళ్లించారని టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై ఈసి స్పందించింది.

Written by - Pavan | Last Updated : Oct 31, 2022, 06:10 AM IST
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
  • టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు
Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు.. 24 గంటలే డెడ్‌లైన్

Komatireddy Rajagopal Reddy Gets EC Notice: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్న బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజగోపాల్ రెడ్డి సొంత వ్యాపార సంస్థ సుశీ ఇన్ ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ కంపెనీ నుంచి రూ. 5 కోట్ల 24 లక్షలు ఉపయోగించినట్టు ఆయనపై టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ అక్టోబర్ 29న ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

మునుగోడు నియోజకవర్గం పరిధిలోని 23 మంది వేర్వేరు వ్యక్తులు, సంస్థలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసి ఆ మొత్తాన్ని వారి చేతే క్యాష్ రూపంలో విత్ డ్రా చేయించి ఓటర్లకు పంచిపెట్టి టీఆర్ఎస్ తమ ఫిర్యాదులో ఆరోపించింది. అక్టోబర్ 14, 18, 29 తేదీలలో ఈ మనీ ట్రాన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు టీఆర్ఎస్ తమ ఫిర్యాదు ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.

టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇచ్చిన ఈ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. అక్టోబర్ 31, సోమవారం లోగా ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీచేసింది. 

టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఆ నగదు బదిలీ మొత్తం మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టడానికి, ప్రలోభాలకు గురిచేయడానికి ఉపయోగించినట్టయితే.. అది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నేరంగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్న ఈసి.. తమరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించలేదని నిరూపించుకోవాల్సిందిగా ఆదేశిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీచేసింది.

Komatireddy-Rajagopal-Reddy-gets-EC-notice.jpg

టీఆర్ఎస్ పార్టీ తమ ఫిర్యాదులో ఆరోపించిన విధంగా నగదు బదిలీ లావాదేవీల వెనుకున్న నిజానిజాలు ఎన్నికల సంఘానికి వెల్లడించి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ( Komatireddy Rajagopal Reddy ) స్పష్టంచేసింది. అక్టోబర్ 31న సాయంత్రం 4 గంటల వరకు గడువు ఇస్తున్నట్టు ఎన్నికల సంఘం తమ నోటీసులు పేర్కొంది.

Also Read : CM KCR SPEECH : నూకలు తినమన్నోడి తోకలు కత్తిరిద్దాం.. మునుగోడు సభలో బీజేపీపై కేసీఆర్ విశ్వరూపం

Also Read : TRS vs BJP: యాదాద్రిలో బండి సంజయ్ ప్రమాణం.. ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు

Also Read : Jagadish Reddy: మంత్రి జగదీష్ రెడ్డి వివరణపై ఈసి అసంతృప్తి.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News