Fish Rain Happen: ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో భారీ చేపల వర్షం, నెట్టింట్లో వీడియో వైరల్
How Fish Rain Happen: భారీ వర్షకాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వింత సంఘటనలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలోని ఓ జిల్లాలో చేపల వర్షం పడింది. ఇది చూసి స్థానికులు తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇతంకి ఇలా చేపల వర్షం కురవడానికి కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
How Fish Rain Happen: భారత దేశ వ్యాప్తంగా వర్షాల కారణంగా వాగులు, చెరవులు ఉంపొంగుతున్నాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. అయితే ఓ గ్రామంలో వీటికి భిన్నంగా ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. వర్షం అంటే మేఘాల నుంచి నీటి బిందువులు పడుతూ ఉంటాయి. కానీ వర్షంతో పాటు చిన్న చిన్న చేపలు పడడంతో ఆ గ్రామంలో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఆంజనేయుడి ఆలయ ఆవరణంలో చేపల వర్షకం ఎక్కువగ కురవడంతో భక్తులంతా అక్కడికి చేరుకుంటున్నారు. ఇటీవలే రోజు వర్షాలు కురవడం వల్ల భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కానీ సుల్తానాబాద్ లోని శాస్త్రి నగర్‌లో భారీ వర్షంతో పాటు ఇలా చేపలు పండడం వల్ల అందరూ తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.
ఈ ఘటన సుల్తానాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిస ప్రాంతాల్లో కూడా ఇలాగే వర్షం పడిందని స్థానికులు చెబుతున్నారు. కురిసిన వర్షంతో పాటు చేపలను స్థానికులు ఇంటికి తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మొదటి సారి అని స్థానికులు చెబుతున్నారు. మహదేవ్ పూర్ మండలంలో కూడా ఇటీవలే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని ఉపాధి హామి పనులకు వెళ్లిన కొందరు కూలీలు చెబుతున్నారు. ఆకాశం నుంచి వర్షం రూపంలో చినుకులతో పాటు భారీగా చేపలు పడ్డాయట..కానీ ఈ చేపలు చూడడానికి అతి భయానకంగా ఉండి, నట్టి రంగును కలిగి ఉన్నాయని వారు అంటున్నారు.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
కొందరు నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం..పెద్ద పెద్ద సముద్రాల్లో సుడిగుండాలు ఏర్పడి ఆవిరి రూపంలోకి కూడా చేపలు మేఘాల్లోకి వెళ్లిపోతాయి. దీని కారణంగా సముద్రంలో చేపలు కూడా నీటి బిందువుల్లో కలిసి పోయి..మేఘాల నుంచి నీటి బిందువుల నుంచి వర్షం రూపంలో చేపలు కూడా పడతాయి. అయితే ఇలా సంఘటనలు జరగడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా చేపల వర్షం కురవడానికి మరో కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. చేరువుల్లో ఏర్పడే ప్రెజర్ ఏరియా క్రియేట్ అవ్వడం వల్ల కూడా ఇలా వర్షం కురుస్తుందట. వేగంగా వీచే గాలుల కారణంగా చేపలన్ని పైకి ఎగిరి వర్షం రుపంలో కింది వస్తాయని నిపుణులు అంటున్నారు.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook