Telangana Beers: తాగుబోతులకు కిక్కే కిక్కే.. తెలంగాణలో 26 కొత్త బీర్ బ్రాండ్లు
26 Beer Brands Entry In Telangana: తెలంగాణలో సరికొత్త బీర్ బ్రాండ్లు రాబోతున్నాయి. ఎప్పుడూ విననీ పేర్లతో బీర్లు రానున్నాయి. 26 కొత్త బీర్ బ్రాండ్లు వస్తున్నాయని సమాచారం.
Beer New Brands: తెలంగాణలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. లేదు లేదంటూనే తెలంగాణలోకి కొత్త బీర్ బ్రాండ్లను ప్రవేశపెట్టబోతున్నది. కొత్త బీర్ల విషయమై మొదట బీఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టగా.. అనంతరం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. అవన్నీ తప్పుడు అని చెబుతూనే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కానీ రెండు రోజులకే మళ్లీ మంత్రి బుకాయించారు. రాష్ట్రంలోకి కొత్త బీర్ బ్రాండ్లు రావడం వాస్తవమేనని అంగీకరించాల్సిన పరిస్థితి. బీర్ల పంచాయతీ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర రచ్చ రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో మచ్చ తగిలింది. ఏది ఏమైనా తెలంగాణలోకి కొత్త కొత్త బీర్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. అవి ఎన్నంటే ఏకంగా 26 రకాల బీర్ బ్రాండ్లు వస్తున్నాయని సమాచారం.
తెలంగాణలో బీర్ల విక్రయానికి మొదట సోమ్ కంపెనీ ముందుకువచ్చింది. అయితే ఆ తదనంతరం మరో 4 కంపెనీలు ముందుకువచ్చాయని సమాచారం. మొత్తం ఐదు కంపెనీలు తెలంగాణలో కొత్త బీర్ బ్రాండ్లను సరఫరా చేయనున్నాయి. ఈ కంపెనీలు మొత్తం 26 బీర్ బ్రాండ్లను తెలంగాణ ప్రజల ముందు ఉంచనున్నాయి. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి.
Also Read: KTR At Charminar: రాజముద్ర మార్పుపై కేటీఆర్ ఆందోళన.. చార్మినార్ వద్ద భారీ నిరసన
తెలంగాణలో ప్రస్తుతం యూబీ కంపెనీదే బీర్ల వాటా అత్యధికంగా ఉంది. కింగ్ ఫిషర్ లైట్, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, బడ్‌వైజర్ బ్రాండ్లను యూబీ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కంపెనీ బీర్ల ఉత్పత్తి తగ్గించింది. దీని కారణంగా వేసవికాలంలో బీర్ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిపై తాగుబోతుల సంఘాలు కూడా ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త కంపెనీలను రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఈ కంపెనీలు రాష్ట్రంలో ఉత్పత్తులు చేయకుండా కేవలం సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి