Saroornagar Honour Killing: సరూర్‌నగర్ పరువు హత్య కేసులో సంచలన నిజాలు.. ఫైండ్ మై డివైజ్ సాయంతో నాగరాజు హత్య
Saroornagar Honour Killing: సరూర్‌నగర్ పరువు హత్య నిందితులకు ఐదురోజుల పోలీస్‌కస్టడీ ముగిసింది. నాగరాజు హత్యకు పాల్పడ్డ నిందితులు సయ్యద్ మొబిన్, మసూద్ అహ్మద్‌ల నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. హత్యకు ఎవరెవరు సహకరించారనే కోణంలో విచారణ జరిపారు.
Saroornagar Honour Killing: తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగరాజు పరువుహత్య నిందితుల పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు అనుమతితో ఐదురోజుల పాటు నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు... కీలక విషయాలను రాబట్టారు. హత్య ఇద్దరే చేశారా..? ఇంకెవరైనా సహకరించారా..? నాగరాజు లొకేషన్ ను ఎలా ట్రాక్ చేశారన్నదానిపై వివరాలు తెలుసుకున్నారు.
సయ్యద్ మొబిన్, మసూద్ అహ్మద్ కలిసి పథకం ప్రకారమే నాగరాజును హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. నాగరాజు జీ మెయిల్ ను యాక్సెస్ చేసిన నిందితులు దాని ద్వారా అతని లొకేషన్ ట్రాక్ చేసినట్లు తెలుసుకున్నారు. మసూద్ జీ మెయిల్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ తన మొబైల్ నెంబర్నే పెట్టుకున్నాడు. నాగరాజు విషయంలోనూ అదే ఉండొచ్చన్న అంచనాతో సేమ్ ట్రిక్ ప్లే చేశారు. అది సక్సెస్ కావడంతో నాగారాజు జీ మెయిల్ లోని ఫైండ్ మై డివైజ్ ఆప్షన్ ద్వారా ఎప్పటికప్పుడు నాగరాజు లొకేషన్ ను ట్రాక్ చేశారు. దీని సాయంతో నాగరాజును ఫాలో చేసిన నిందితులు సరూర్‌నగర్ లో అతన్ని దారుణంగా హత్య చేశారు.
నాగరాజు పరువు హత్యలో నిందితులకు ఇంకెవరైనా సాయం చేశారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తమకు ఎవరూ సాయం చేయలేదని ఇద్దరం కలిసే హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితులు తెలిపారు. మసూద్, మొబిన్‌ల మొబైల్‌లోని కాల్ డేటాను కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. హత్య చేసిన రోజు వారు కుటుంబసభ్యులతో తప్ప ఇంకెవరితోనే మాట్లాడలేదని తేల్చారు. నిందితుల కస్టడీ ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.
తనకు ఇష్టం లేకున్నా తన చెల్లి అశ్రీన్‌నిని మతాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో నాగరాజు ను దారుణంగా చంపేశాడు మొబిన్. తన బావ మసూద్ అహ్మద్ సాయంతో సరూర్‌నగర్ లో నడిరోడ్డుపై హత్యచేశాడు. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
also read: Puvvada vs Mallanna: తీన్మార్ మల్లన్నకు పరువు నష్టం దావా నోటీసులు..ఎవరు ఇచ్చారంటే..!
also read: Power Charges Hike: వినియోగం పెరగకపోయినా డబుల్... జనాలకు షాకిస్తున్న కరెంట్ బిల్లులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.