Puvvada vs Mallanna: తెలంగాణలో పరువు నష్టం దావా అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా నోటీసులు జారీ చేశారు. దీనిపై మాటల యుద్ధం సైతం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా జర్నలిస్టు తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ అజయ్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
ఈమేరకు తన న్యాయవాది ద్వారా తీన్మార్ మల్లన్నకు మంత్రి పువ్వాడ అజయ్ నోటీసులు పంపారు. కావాలనే మంత్రి పువ్వాడ అజయ్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసి..పరువుకు భంగం కల్గించారని నోటీసుల్లో న్యాయవాది తెలిపారు. దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించారని వివరించారు. జర్నలిస్ట్‌గా కనీస ప్రమాణాలు పాటించకుండా నడుచుకున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇందుకుగాను తీన్మార్ మల్లన్న(TEENMAR MALLANNA)కు పరువు నష్టం దావా నోటీసులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రికి రూ.10 కోట్ల పరిహారం చెల్లించాలని న్యాయవాది తెలిపారు. లేకపోతే ఏడు రోజుల్లో తన క్లైంట్ మంత్రి పువ్వాడకు బేషరతుగా క్షమాణ చెప్పాలన్నారు. దీనిపై స్పందించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు.
Also read:AP Govt: 15 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం..జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!
Also read:Kamal Haasan: మాతృ భాష కోసం దేనికైనా రెడీ..కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook