COVID-19 cases: హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులతో కరోనావైరస్ ( Coronavirus ) కరాళ నృత్యం చేస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌‌ను ( Pragathi Bhavan ) తాకింది. వారం రోజుల్లో దాదాపుగా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎంఓ కార్యాలయవర్గాలు ( Telangana CMO ) పేర్కొంటున్నాయి. అయితే ఇందులో పలువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణలో ప్రగతిభవన్‌‌ను పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ( Sanitization ) చేస్తూ కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP COVID-19 Deaths: ఏపీలో 200 దాటిన కరోనా మరణాలు


మరోవైపు జీహెచ్‌ఎంసీ ( GHMC ) పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్‌ పరిధిలో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం భావించింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు