కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలల నుంచి  విమాన సర్వీసులు రద్దయ్యాయి. నేటి తెల్లవారుజాము నుంచి విమాన సర్వీసులను పునఃప్రారంభించారు. ఐతే అలా ప్రారంభమయ్యాయో లేదో ఇలా రద్దు చేశారు. దీంతో ప్రయాణీకులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్ పోర్టు లాంజ్ లోనే కొన్ని గంటలుగా విమనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే రాత్రికి రాత్రే పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఎందుకు..? ఏంటి..? అనే కారణాలు మాత్రం బయటకు తెలియనివ్వడం లేదు. 


[[{"fid":"186022","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


పలు రూట్లలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణీకులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అనూహ్యంగా జరిగిన ఈ మార్పుతో అసలు విషయం ఏంటో అర్ధం కాక పడిగాపులు పడుతున్నారు. మరికొన్ని విమానయాన సంస్థలు నిర్ధేశించిన సమయం కంటే నాలుగు గంటలు ముందుగానే ఎయిర్ పోర్టుకు రావాలని పలువురు ప్రయాణీకులకు సమాచారం ఇచ్చాయి. కానీ తీరా ఎయిర్ పోర్టుకు వచ్చాక విమాన ప్రయాణం మరో రెండు గంటలు పడుతుందని వెల్లడించాయి. దీంతో ప్రయాణీకులు వేచి ఉండక తప్పడం లేదు. సొంతూళ్లకు వెళ్లాలంటే ఇంత ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


[[{"fid":"186024","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..