KCR House: మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి తాగునీటి ఇబ్బందులు.. నీరు రాకుండా రేవంత్ రెడ్డి కుట్రనా?
పదేళ్ల కాలంలో కరువు, నీటికి కటకట అనే పదాలు వినని తెలంగాణ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ పడాలు వింటోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఎవరి వైఫ్యలమో చెప్పలేం కానీ తెలంగాణ గొంతెండుతున్న పరిస్థితులు. తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా నీటి కష్టాలు తప్పలేదు. నీటికి తిప్పలు ఎదురుకావడంతో ట్యాంకర్‌ను రప్పించిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
KCR House Water: పదేళ్ల కాలంలో కరువు, నీటికి కటకట అనే పదాలు వినని తెలంగాణ సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ పడాలు వింటోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఎవరి వైఫ్యలమో చెప్పలేం కానీ తెలంగాణ గొంతెండుతున్న పరిస్థితులు. తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా నీటి కష్టాలు తప్పలేదు. నీటికి తిప్పలు ఎదురుకావడంతో ట్యాంకర్‌ను రప్పించిన విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: Jithender Reddy: తెలంగాణలో ఉండగానే మోదీకి షాక్.. కాంగ్రెస్‌లోకి బీజేపీ అగ్ర నాయకుడు
అధికారం కోల్పోయిన అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న సొంత ఇంటికి చేరుకున్నారు. గాయపడి సర్జరీ అనంతరం నందినగర్ ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని రోజులు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వెళ్లినా ఇప్పుడు ఈ ఇంటి నుంచే రాజకీయాలు నడిపిస్తున్నారు. దీంతో ఈ ఇంటికి ప్రముఖుల రాకపోకలు పెరిగాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఇంటికి నీటి సమస్య ఏర్పడింది.
Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?
ఈ సమాచారం తెలుసుకున్న జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెంటనే రంగంలోకి దిగి ట్యాంకర్‌ను పిలిపించారు. కేసీఆర్ ఇంటి ఆవరణలోని సంప్‌లో నీటిని నింపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో నీటి సమస్యలు ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్టు తెలుస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ ప్రజలకు తాగునీళ్లు కూడా దొరకని పరిస్థితి అని ఆరోపిస్తున్నారు.
ఒక్క హైదరాబాద్ కాదు తెలంగాణ అంతటా ఇదే సమస్య ఉందని ఈ వీడియో చూసిన ప్రజలు అంటున్నారు. తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు బిందెలు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా ఆడిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.
అయితే కేసీఆర్‌పై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వ్యక్తిగతంగా పగ బట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ఇంటికి నీళ్లు ఇవ్వడం లేదా పలువురు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదని.. రాష్ట్రంలో ప్రజలందరికీ తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ పదేళ్ల తర్వాత మళ్లీ కరువు కాలాన్ని చూస్తోంది. ఇప్పుడే ఇలా ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఇంకెన్ని ఇబ్బందులు ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి