KTR AP Elections: ఏపీ ఎన్నికలపై కేటీఆర్ జోష్యం.. మళ్లీ ఆయనే గెలవాలంటూ వ్యాఖ్యలు
KTR Prediction On Andhra Pradesh Elections: మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై స్పందించగా.. తాజాగా ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలపై జోష్యం చెప్పారు.
KTR AP Elections: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తుండగా.. ఏపీ ఎన్నికలపై మాత్రం పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మొన్నటి దాకా అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్‌ఎస్ పార్టీ ఏపీ ఎన్నికలపై స్పందించింది. మొన్న ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 'జగన్ గెలుస్తున్నారనే సమాచారం ఉంది' అని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు.
Also Read: KCR Entry X Insta: కేసీఆర్ కొత్త ప్రయాణం.. ఎక్స్, ఇన్‌స్టాలోకి ప్రవేశించిన గులాబీ బాస్
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గులాబీ జెండా ఎగురవేసిన అనంతరం కార్యాలయంలో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా స్పందించారు. 'చాలా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నా. మాకు ఉన్న సమాచారం ప్రకారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో గెలుస్తున్నారు' అని ప్రకటించారు.
Also Read: YSRCP Manifesto: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో కీలక హామీలు ఇవే.. వీటితో జగన్‌కు మరోసారి సీఎం అవుతారా?
ఎన్నికల్లో గెలిచేదెవరోనని కేసీఆర్, కేటీఆర్ స్పష్టంగా చెబుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. వారి వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. అక్కడి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ ప్రకటనలను స్వాగతిస్తున్నాయి. ఏపీ ప్రజల నాడీని వారు చెప్పారని.. ప్రజల్లో కూడా అదే ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం కేసీఆర్, కేటీఆర్ ప్రకటనలను తప్పుబడుతున్నాయి. జగన్‌తో డబ్బులు తీసుకుని వారిద్దరూ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్‌కు ఎదురైన అనుభవం ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు ఎదురుకాబోతుందని చెబుతున్నారు. ఈ వివాదంతో తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ సరికొత్త వివాదం రాజుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter