హైదరాబాద్ :  కరోనా వైరస్‌తో ( Corona virus ) తెలంగాణ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత మాతంగి నర్సయ్య మృతి ( Matangi Narsaiah death ) చెందారు. 20 రోజుల క్రితం కరోనా సోకిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఐతే కరోనా లక్షణాలతో పాటు ( Coronavirus symptoms ) ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మాతంగి నర్సయ్య భార్య జోజమ్మ సైతం 15 రోజుల క్రితం కరోనాతోనే మృతి చెందడం గమనార్హం. 15 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ఇద్దరు కరోనాకు బలవడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. Also read : COVID-19 AP: ఏపీలో 4 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియోజకవర్గం ( Medaram assembly constituency ) నుంచి గెలిచిన నర్సయ్య.. కొంతకాలం పాటు మంత్రిగానూ సేవలు అందించారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. Also read : CSK in IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్‌కి భారీ ఊరట