Pocharam Srinivas reddy joined in congress party: బీఆర్ఎస్ కు కష్టాలు ఇప్పట్లో వదిలేలా లేవని చెప్పుకొవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది. మరోవైపు.. ఎంపీ ఎన్నికలలో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే కడియం శ్రీహరి, కే కేశవరావు వంటి సీనియర్ నేతలు కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. వీరంతా కేసీఆర్ గతంలో సీఎంగా ఉన్నప్పుడు.. అధికారం, అన్నిరకాల హోదాలను అనుభవించారు. ఇటీవల ప్రభుత్వం మారగానే వరుసగా ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవైపు కేసీఆర్ కూతురు తీహర్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో అసత్య సమాచారం ఇచ్చారని పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం, ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశాలు క్రమంగా కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నాయి. పార్టీల నుంచి వరుసగా నేతలంతా క్యూలు కట్టి మరీ బైటకు వెళ్లిపోతున్నారు. ఇలాంటి కష్టపరిస్థితుల్లో ములిగే నక్క మీద తాటి కాయ పడ్డట్లు.. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. 


పూర్తి వివరాలు..


మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, తన కొడుకుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పోచారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. మ‌ళ్లీ చివ‌ర‌గా రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. నా జీవితంలో రాజ‌కీయంగా ఆశించేది ఏం లేదు. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి టీఆర్ఎస్‌లో చేరాను. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. మ‌ళ్లీ చివ‌ర‌గా రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనని పోచారం క్లారిటీ ఇచ్చారు. 


రేవంత్ చేస్తున్న కార్య‌క్ర‌మాలు న‌చ్చి వారి నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌ని కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఈ నేపథ్యంలో.. రైతుల సంక్షేమాన్ని మాత్ర‌మే నేను కోరుకుంటున్నాను. రేవంత్‌ను భ‌గ‌వంతుడు ఆశీర్వ‌దించాల‌ని ప్రార్థిస్తున్నానని పోచారం అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. బాన్సువాడ బీఆర్ఎస్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి  గారిని కూడా కలుపుకొని పోతామన్నారు.  


Read more: Snakes: వామ్మో..ఇంట్లో బైట పడ్డ 32 పాము పిల్లలు.. షాకింగ్ వీడియో వైరల్..


తెలంగాణ రైతుల సంక్షేమం  కోసమే తాను.. కాంగ్రెస్ లో చేరానని పోచారం అన్నారు. రైతు రుణమాఫీ విధివిధానాలపై ఇవాళ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామని సీఎం రేవంత్ అన్నారు.భవిష్యత్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు.నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను  పూర్తిచేసేందుకు అన్ని రకాలుగా సహయంచేస్తామని రేవంత్ అన్నారు. ఇది రైతు రాజ్యం.. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకుని పోతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి