Telangana Omicron Cases : తెలంగాణలో విజృంభిస్తోన్న ఒమిక్రాన్.. 7 కు చేరిన కేసులు.. తస్మాత్ జాగ్రత్త
Telangana new Omicron Cases : తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మరింత పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో తెలంగాణలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కు చేరింది. మరో మూడు కేసులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది.
Four more persons test positive for Omicron in Telangana state’s tally rises to 7 : తెలంగాణలోకి తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరితో ఒక బాలుడు ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) బారినపడినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలో ఒమిక్రాన్ (Omicron in Telangana) కేసులు మరింత పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు (Four new Omicron cases) వెలుగు చూశాయి. దీంతో తెలంగాణలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకు (seven Omicron cases) చేరింది. మరో మూడు కేసులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది.
అయితే ఒమిక్రాన్ బారినపడ్డ వారితో కాంటాక్ట్ అయిన వారందరినీ గుర్తించి వారికి పరీక్షలు చేయనున్నారు వైద్యశాఖ అధికారులు. తాజాగా ఒమిక్రాన్‌కు గురైన వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌తో పాటు వారు ఏ దేశాల నుంచి వచ్చారు.. తెలంగాణలో (Telangana) ఏయే ప్రాంతాల్లో తిరిగారనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పటికే ఒమిక్రాన్ బారిన పడిన ఇద్దరు టిమ్స్‌లో (Tims) చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం (Telangana Government) అప్రమత్తం అవుతోంది. విమానాశ్రయాల్లోనే ఒమిక్రాన్ కేసులకు సంబంధించి పరీక్షలను వేగవంతం చేశారు. ఒమిక్రాన్ బారినపడినట్లు తేలితే వెంటనే గచ్చిబౌలిలోని టిమ్స్ హాస్పిటల్‌కు (Tims Hospital) తరలిస్తున్నారు. బాధితులను అక్కడే ఐసోలేషన్‌లో (Isolation) ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అలాగే విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వారిని కూడా వెంటనే టిమ్స్‌కు తరలిస్తున్నారు.
ఇక తెలంగాణలో మొదట వెలుగు చూసిన మూడు కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆ ఇద్దరు వ్యక్తులు చేరుకున్నారు. కెన్యాకు చెందిన ఆమెకు 24 ఏళ్లు కాగా, సోమాలియా అతనికి 23 ఏళ్ల వయస్సు ఉంది. ఈ నెల 12వ తేదీనే వీరిద్దరి శాంపిల్స్ సేకరించారు. తర్వాత జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. దీంతో తాజాగా ఫలితాలు వచ్చాయి. అందులో వారిద్దరికీ ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. దీంతో వారిద్దరినీ టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిద్దరూ మెహిదీపట్నం, టోలీచౌకీలో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్‌లు నిర్వహించారు.
ఇక ఏడేళ్ల వయస్సున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలుడికి కూడా ఒమిక్రాన్ (Omicron) పాజిటివ్ వచ్చింది. అయితే ఆ బాలుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Shamshabad Airport) దిగిన వెంటనే నేరుగా అటు నుంచి అటే కోల్‌కత్తాకు వెళ్లాడు. తెలంగాణలోకి ప్రవేశించలేదు. ఇక ఇప్పుడు కొత్తగా నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో (Telangana) మొత్తం కేసుల సంఖ్య 7కి చేరింది.
Also Read : Etela Rajender Press Meet: ఈటెల సంచలన వ్యాఖ్యలు.. TRS నేతలు టచ్‌లోనే ఉన్నారు.. KCR పై పోటీకి సిద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook