Electricity Bill: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ మరో హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల అంటే మార్చికి సంబంధించిన విద్యుత్‌ బిల్లులు చెల్లించనవసరం లేదని ప్రకటించారు. గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్‌ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్‌


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుతో కలిసి ఆదివారం భట్టి విక్రమార్క పర్యటించారు. కొత్తగూడెం-రామవరంలో సింగరేణి సంస్థ ఏర్పాటుచేసిన సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. 'గృహజ్యోతి పథకం అమలు చేసేందుకు కసరతతు చేస్తున్నాం. అందులో భాగంగా మార్చి నెలలో 200 యూనిట్ల లోపు విద్యుత్‌ బిల్లు చెల్లించాల్సిన అసవరం లేదు' అని ప్రకటించారు. విద్యుత్‌ శాఖ విషయంలో సమీక్ష చేస్తున్నామని.. త్వరలోనే కొత్త విద్యుత్‌ విధానం తీసుకొస్తామని తెలిపారు. పదేళ్లుగా విద్యుత్‌ పాలసీ లేకపోవడం శోచనీయమన్నారు.

Also Read: Delhi Liquor Scam: 'నాకు చాలా అనుమానాలున్నాయి.. విచారణకు రాలేను': సీబీఐకి కవిత లేఖ


ఈనెల 27వ తేదీన మరో రెండు గ్యారంటీ పథకాలను అమలు చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు వివరించారు. డ్వాక్రా సంఘాలకు త్వరలోనే వడ్డీ లేని రుణామాలు అందిస్తామని చెప్పారు. 'పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం మాటలకే పరిమితం కావడంతో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు గుదిబండగా మారాయి' అని విమర్శించారు.


సింగరేణి సంస్థ విషయమై భట్టి విక్రమార్క మాట్లాడుతూ..రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణి సంస్థకే చెందాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తుచేశారు. 43 వేల మంది సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి