Gaddar Awards - Revanth Reddy: సినీ కళాకారులకు డబ్బులతో వచ్చే రివార్డుల కన్నా.. ప్రభుత్వం ఇతర
సంస్థలు తమ ప్రతిభను గుర్తించి ఇచ్చే అవార్డులంటే అమితమైన గౌరవం. ఇక తెలుగు సినీ ఇండస్డ్రీకి సంబంధించి నంది అవార్డులను 1964లో మొదలైయ్యాయి. అంతకు పదేళ్లే ముందే 1954 నుంచి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ఇస్తూ వచ్చింది. ముందు ఉత్తమ చిత్రం.. ద్వితీయ చిత్రం.. తృతీయ చిత్రం తో పాటు దర్శకుడితో పాటు కొన్ని అవార్డులే ఇస్తూ ఉండేవారు. 1967 నుంచి జాతీయ స్థాయిలో ఉత్తమ నటీనటీలకు సంబంధించిన అవార్డులను ప్రధానం చేయడం మొదలుపెట్టారు. ఇక 1964లో కాసు బ్రహ్మానంద రెడ్డి సమయంలో ఈ అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. 1965లో అంతకు ముందు యేడాది ఉత్తమ చిత్రాల అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. 1977 నుంచి ఉత్తమ నటీనటులకు సంబంధించిన నంది అవార్డులు ఇస్తూ వచ్చారు. 2011 వరకు ఈ అవార్డులు ప్రకటించడంతో పాటు ఇవ్వడం జరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ అవార్డులను ఇవ్వడంపై అంతగా ఫోకస్ పెట్టలేకపోయింది. ఆ తర్వాత 2014లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్.. తెలంగాణ, ఏపీగా రెండుగా విడిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 2012 నుంచి 2013 నంది అవార్డులను ఒకసారి..  ఆ తర్వాత 2014, 2015, 2016 నంది అవార్డులను ప్రటించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలకే ఈ అవార్డులు దక్కాయనే విమర్శలు ప్రతిపక్షాలు వ్యక్తం చేసాయి.


ఆ తర్వాత 2014లో జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కొలువైన కేసీఆర్ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో యాదాద్రి నరసింహా స్వామికి గుర్తుగా సింహా అవార్డ్స్ ఇస్తానంటూ ప్రకటన చేసింది. అప్పటికే సప్తగిరి అంటూ దూరదర్శన్ ఉన్న తెలుగు ఛానెల్‌కు ఇక్కడ యాదగిరి అంటూ పేరు పెట్టారు. అదే తరహాలో సింహా అవార్డ్స్ అంటూ హడావుడి చేసింది. దీనిపై ఒక కమిటిని కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దీనిపై ఉలుకు లేదు పలుకు లేదు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి కొంత మంది పెద్దలు ఈ విషయమై అప్పటి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లినా.. ఆయన నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇక తెలంగాణ ఏర్పిడిన తర్వాత ఏర్పడిన మూడో ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి తాజాగా సినిమా కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో ప్రజా గాయకుడు గద్దర్ అవార్డులను ఇస్తానంటూ ప్రకటన చేసారు.


ఆయనపై గౌరవంతో రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేసినా.. దీనిపై ఒక వర్గం వాళ్లు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరొవైపు ఇంకొందరు సినిమాలకు అంతగా సంబంధం లేని మాజీ దళ సభ్యుడైన గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడం పై విమర్శలు చేస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ అవార్డు ప్రకటన చేసినట్టు కనబడుతుందని అందరు సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు.  


ఏదైనా గద్దర్ అవార్డు ఇవ్వాలంటే తెలంగాణ ప్రజా కవులకు, ఉద్యమ కారులకు ఇస్తే ఇవ్వండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్.. మన దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ చలన చిత్ర అవార్డులున్నాయి. ఫిల్మ్‌ఫేర్ గట్రా అంటూ ఇతర ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవార్డులున్నాయి. ఈ గద్దర్ అవార్డు ఏంటి అంటూ ప్రశ్నిస్తారు. ఆయన ఒకటో రెండో సినిమల్లో యాక్ట్ చేసినంత మాత్రాన గద్దర్ పేరిట ఈ అవార్డు ఇవ్వడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గద్దర అంటే మాకు గౌరవమే ఉంది. కానీ సినీ రంగంతో సంబంధం లేని ఈ వ్యక్తి పేరిట అవార్డులు ఇవ్వడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీకి చేసిన మేలు ఏమిటి ? సేవలు ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఒకవేళ ఇవ్వాలనుకుంటే.. తెలంగాణ నుంచి హిందీ చిత్రసీమను ఏలిన పైడిజైరాజ్ పేరిట కానీ.. కత్తి కాంతారావు పేరిట కానీ అవార్డులు ఇస్తే బాగుంటుందని తెలంగాణలోని సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు.


ఇంకొంత మంది మాత్రం గద్దర్ ఎంతో మంది అమాయక యువకులను దళం వైపు వెళ్లేలా చేసారన్నారు. కానీ అదే ఆయన కుటుంబం విషయానికొస్తే.. తన ఇంట్లోని సంతానాన్ని దళం వైపు వెళ్లనీయలేదనే కామెంట్స్ చేస్తున్నారు.ఇతరులు సంతానం పోలీసుల కాల్పుల్లో చనిపోయినా.. పర్వాలేదు.. కానీ తమ కుటుంబ సభ్యులు ఎవరు పోలీసుల తుపాకీ తూటాలకు బలి కానీయద్దని అటు వైపు వెళ్లనీయలేదు. ఆ తర్వాత దళం నుంచి బయటకు వచ్చాకా.. తెలంగాణ ప్రజల గొంతుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఆయన పేరిట ఇవ్వాలనుకుంటే ఏదైనా సంస్థకు ఆయన పేరును కానీ.. ప్రజాకవులకు అవార్డులు ఇస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డికి చెబుతున్నారు. మరి గజ్జ కట్టి ఎంతో మందిన ప్రభావితం చేసిన గద్దర్ అన్నను మించిన కళాకారుడు లేడు. ఆయన పేరిట ఈ అవార్డు ఇస్తే నొప్పి ఏంటని కూడా మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డ్స్ అంటూ ప్రకటన చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


Also read: Jharkhand Politics: హేమంత్ సోరెన్ అరెస్ట్, జార్ఘండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.