Passport Seva Kendras: సౌదీ, కువైట్ దేశాలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్
Police Clearance Certificate: జీ తెలుగు ప్రతినిధి, కరీంనగర్ : కువైట్‌కి ఉద్యోగాలకి వెళ్లేవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పిసిసి) దాఖలు చేయడం తప్పనిసరి అనే నిబంధన ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. సౌదీ అరేబియాకు వెళ్లేవారు కూడా పిసిసి తప్పనిసరిగా దాఖలు చేయాలని ఇటీవల సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.
Police Clearance Certificate: జీ తెలుగు ప్రతినిధి, కరీంనగర్ : కువైట్‌కి ఉద్యోగాలకి వెళ్లేవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పిసిసి) దాఖలు చేయడం తప్పనిసరి అనే నిబంధన ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. సౌదీ అరేబియాకు వెళ్లేవారు కూడా పిసిసి తప్పనిసరిగా దాఖలు చేయాలని ఇటీవల సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. విదేశాంగ శాఖ ఉన్నతాధికారి డా. ఔసాఫ్ సయీద్ ఇటీవల హైదరాబాద్‌ను సందర్శించిన సందర్భంగా పిసిసి పొందడంలో ఎదురవుతున్న సమస్యలను పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే స్పందించిన ఆయన.. పిసిసి పొందడంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని మొత్తం ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు టోలీచౌకీ, బేగంపేట, అమీర్‌పేట, నిజామాబాద్, కరీంనగర్‌లలో అపాయింట్‌మెంట్ లేకుండానే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ల కోసం వాక్-ఇన్ దరఖాస్తులను ప్రత్యేకంగా ప్రాసెస్ చేయడానికి శనివారాల్లో ప్రత్యేక కౌంటర్లు పని చేసేలా డా. ఔసాఫ్ సయీద్ ఏర్పాట్లు చేశారు.
గల్ఫ్ కార్మికులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు పొందడానికి ఎదుర్కొంటున్న సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారం చూపిన హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఐఫ్ఎస్ అధికారి డా. ఔసాఫ్ సయీద్‌కు గల్ఫ్ కార్మికుల పక్షాన టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఒక ప్రకటనలో కృతఙ్ఞతలు తెలిపారు.
డా. ఔసాఫ్ సయీద్ మే 1993 నుండి 1995 వరకు హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్‌గా పని చేశారు. సౌదీ అరేబియాలోని జద్దాలో ఇండియన్ కాన్సుల్ జనరల్‌గా, రియాద్‌లో ఇండియన్ అంబాసిడర్‌గా పనిచేశారు. ఖతార్‌లో ఇండియన్ అంబాసిడర్‌గా పనిచేశారు. అలా విదేశాలకు వెళ్లే వారు ఎదుర్కొనే ఇబ్బందులపై.. మరీ ముఖ్యంగా సౌదీ, కువైట్‌కు వెళ్లే వారికి ఎదురయ్యే అవాంతరాలను అర్థం చేసుకుని ఆ సమస్యలకు పరిష్కారం దిశగా ప్రత్యేక కృషి చేశారు.
Also Read : Bandi Sanjay: కాళేశ్వరం సందర్శనకు బీజేపీ బృందం.. అవినీతి లెక్క తేల్చేందుకేనా?
Also Read : TRS MLA JUMP: బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే? కేంద్రమంత్రి డీల్.. త్వరలోనే ముహుర్తం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి