గజల్ శ్రీనివాస్‌పై ఆరోపణలకి ఆధారాలున్నాయి: పంజాగుట్ట ఏసీపీ
రేడియో జాకీపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపర్చారు.
రేడియో జాకీపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపర్చారు. అయితే, అతడిని కోర్టుకి తరలించడానికన్నా ముందుగా పంజాగుట్ట పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఏసీపీ విజయ్ కుమార్.. గజల్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసిన యువతి పలు ఆధారుల కూడా సమర్పించారని స్పష్టంచేశారు.
సేవ్ టెంపుల్ అనే ధార్మిక సంస్థ కార్యాలయంలో పనిచేస్తోన్న తనపై గత కొంత కాలంగా గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా ఏసీపీ తెలిపారు. గజల్ శ్రీనివాస్ తనకి బలవంతంగా ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం, నగ్నంగా వుండమని ఆదేశించడం, తన చేత మసాజ్ చేయించుకోవడం వంటి పనులు చేసి వేధింపులకి గురిచేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా అందుకు అవసరమైన ఆధారాలు సైతం సమర్పించారని ఏసీపీ మీడియాకు వెల్లడించారు. బాధితురాలు సమర్పించిన ఆధారాలు పరిశీలించిన తర్వాతే అతడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశాం అని అన్నారు ఏసీపీ విజయ్ కుమార్.