Telangana BJP Leaders Meets PM Modi: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కి చెందిన బీజేపి కార్పొరేటర్లతో పాటు తెలంగాణకు చెందిన పలువురు ఇతర బీజేపి నేతలు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తెలంగాణ బీజేపి నేతలతో జరిగిన ఈ ప్రత్యేక భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ఈ భేటీ అనంతరం ట్విటర్ ద్వారా క్లుప్తంగా పలు వివరాలు వెల్లడించిన ప్రధాని మోదీ.. ప్రజలకు ఎలా సేవ చేయాలి, ముఖ్యంగా అట్టడుగు స్థాయి ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అనే అంశాలపై చర్చించినట్టు తమ ట్వీట్ లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు, అలాగే కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు ముఖ్యనేతలను కలిసిన ఫోటోలను ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సుపరిపాలన కోసం బీజేపి సర్కారు పని చేస్తుందని హామీ ఇచ్చిన ఆయన.. తెలంగాణలో కుటుంబపాలనకు బీజేపి చరమ గీతం పాడుతుందని తెలంగాణ సర్కారును హెచ్చరించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలావుంటే.. ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్ పై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ ట్వీట్ కి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా ? లేక ఏదైనా ఎన్జీవో సంస్థను నడిపిస్తున్నారా ? అని సెటైర్లు వేశారు. వరదల్లో నష్టపోయిన హైదరాబాద్ కి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే మూసీ ప్రక్షాళనకు నిధులు ఏమయ్యాయని, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణతో పాటు ఐటిఐఆర్ ప్రాజెక్టుపై ఏమైనా అప్‌డేట్స్ ఉన్నాయా అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 



మంత్రి కేటీఆర్ (Minister KTR) చేసిన ఈ కౌంటర్ ట్వీట్‌కి తెలంగాణ బీజేపి నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ రానుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Also read : Hyderabad Gang Rape:దోషులను వదిలేసి.. ఆధారాలిచ్చిన ఎమ్మెల్యేపై కేసా! సిగ్గులేని ప్రభుత్వమన్న సంజయ్..


Also read : Raghunandan Rao: గ్యాంగ్‌ రేప్‌ కేసులో నిందితులను తప్పించే కుట్ర..తానేవరికీ భయపడను: రఘునందన్‌రావు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook