GHMC Election 2020 Results: హైదరాబాద్‌: ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ( GHMC Election Results ) ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. చివరిసారి 2016 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఏ పార్టీకి కూడా హైదరాబాద్ ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు. అయితే 150 డివిజన్లకు గాను 149 డివిజన్ల ఫలితాలే విడుదలయ్యాయి. నేరెడ్‌మెట్ డివిజన్ ఫలితం వెలువడాల్సి ఉంది. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు ఉండటంతో.. హైకోర్టు తీర్పు తర్వాత ఫలితాన్ని ప్రకటించే అవకాశముంది. Also read : GHMC Election results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై బీజేపి స్పందన..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతం కంటే తక్కువగా 55 డివిజన్లల్లో గెలిచి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ (TRS) మొదటి స్థానంలో నిలిచింది. దుబ్బాక ఉప ఎన్నిక విజయోత్సాహంతో బరిలోకి దిగిన బీజేపీ ( BJP ) 48 డివిజన్లలో కాషాయ జెండాను ఎగుర వేసి రెండో స్థానంలో బలమైన పార్టీగా అవతరించింది. ఎప్పటిలాగానే ఎంఐఎం (MIM) 44 డివిజన్లల్లో విజయం సాధించి తన పట్టును నిలుపుకుంది. అయితే కాంగ్రెస్‌ (Congress) మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమై ఘోర పరాభవాన్ని చవిచూసింది. Also read: ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా.. గ్రేటర్ ఓటమికి నైతిక బాధ్యత


అయతే మొత్తం 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం దక్కాలంటే 76 సీట్లు సాధించాలి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. కావున గ్రేటర్ మేయర్ పీఠం కోసం ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. అయితే 150 డివిజన్ల కార్పొరేటర్లు, 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటువేసే వారి సంఖ్య 202కి చేరనుంది. మేయర్ పీఠం దక్కాలంటే 102 మంది సభ్యుల మద్దతు అవసరం. టీఆర్‌ఎస్‌కు అధికంగా 37, బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 1, ఎంఐఎంకు 10 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులున్నారు. అయితే అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఎక్స్ అఫీషియో కలుపుకున్నా మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో 10 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. దీంతో గ్రేటర్ పీఠం కోసం టీఆర్ఎస్, ఎంఐఎంలు చేతులు కలపడం అనివార్యంగా మారనుంది. Also read: GHMC Elections Results 2020: మేయర్ స్థానంపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..


 


Also read : MP Arvind Dharmapuri: తెలంగాణలో బీజేపికి 15 లోక్ సభ సీట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook