హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన గ్రేటర్ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. అంతా ఊహించినట్లుగానే మెహదీపట్నంలో తొలి ఫలితం వచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వెలువడిన తొలి ఫలితంలో ఎంఐఎం బోణీ కొట్టింది. మెహదీపట్నం డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్థి మాజీద్‌ హుస్సేన్‌  గెలుపొందారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!


 


ఈ డివిజన్‌లో అత్యల్పంగా 11,818 ఓట్లు పోలయ్యాయి. దీంతో మెహిదీపట్నం ఫలితం త్వరంగా వచ్చే అవకాశముందని అధికారులు ముందుగానే అంచనా వేశారు. హైదరాబాద్ మాజీ మేయర్, ఎంఐఎం అభ్యర్థి మాజీద్ హుస్సేన్ తాజా జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 (GHMC Elections 2020) ఫలితాలలో తొలి విజేతగా అవతరించారు. నేటి ఉదయం 8 గంటలకు జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 1,122 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. టీఆర్ఎస్ జోరుకు కమలం పార్టీ బ్రేకులు వేసింది.



జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పలు స్థానాల్లో ఆధిక్యాలు మారుతున్నాయి. కొన్ని స్థానాల్లో ఓట్లు అధికంగా రావడంతో గందరగోళం నెలకొంది. అదే సమయంలో కొన్ని కేంద్రాలలో ఓట్లు తక్కువగా వచ్చాయని నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ వాతావరణం నెలకొంది.


Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook