GHMC Election Results 2020 Live Updates: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎలక్షన్స్ 2020 ఫలితాలలో బీజేపీ పుంజుకుంది. అధికార టీఆర్ఎస్ ఎస్ పార్టీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే భార్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. హబ్సిగూడ డివిజన్ నుంచి పోటీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య బేతి స్వప్న ఓటమి చెందారు. బేతి స్వప్నపై బీజేపీ అభ్యర్థి చేతన విజయం సాధించారు. ఖైరాతాబాద్ డివిజన్‌లో దివంగత పి.జనార్దన్‌ రెడ్డి (PJR) కుమార్తె, టీఆర్ఎస్ అభ్యర్థి విజయా రెడ్డి గెలుపొందారు. 
Also Read : GHMC Election Results 2020: తొలి ఫలితం వచ్చేసింది. తొలి విజేత ఎంఐఎం అభ్యర్థి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 (GHMC Election Results 2020) ఫలితాలలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 36 స్థానాల్లో విజయం సాధించగా, మరో 22 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం పార్టీ 30 స్థానాలను గెలుచుకోగా, మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికారం మాదే అంటూ ఎన్నికల బరిలో దిగిన బీజేపీ 26 డివిజన్లలో విజయబేరి మోగించగా.. మరో 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్‌ కేవలం రెండు డివిజన్లకే పరిమితమైంది. ఇతరులు ఖాతా తెరవలేదు.


Also Read : GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook