హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీపై ఆ పార్టీకే చెందిన నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో రూ. 68 వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని తెలంగాణ సర్కార్ చెప్పుకుంటోంది కానీ.. ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని ప్రభుత్వానికే సూటి ప్రశ్నలు సంధించారు. నగరంలో ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్లను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నిర్మించినవి కాగా… ఇటీవల కాలంలో వాటి నిర్వహణ కూడా సరిగా ఉండటం లేదని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే అభివృద్ధి పనులు చేసి ఉంటే ప్రజల్లో అసంతృప్తి ఎందుకు ఉంటుందని డి శ్రీనివాస్ ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపైనా డిఎస్ అసంతృప్తి:
టీఆర్ఎస్ ప్రభుత్వం ( TRS govt ) ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తున్న తీరు అతి దారుణంగా ఉందన్న డిఎస్... తాను జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికలు ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తే బాగుంటుందని హితవు పలికిన డిఎస్... హైదరాబాద్ వరదల్లో సర్వం కోల్పోయిన వరద బాధితులకు సాయాన్ని పూర్తిగా అందించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించి ఉండుంటే బాగుండేదని అన్నారు. ఏదేమైనా ఇప్పటికిప్పుడు హడావుడిగా గ్రేటర్ ఎన్నికలకు ( GHMC Elections ) వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వ వైఖరిపై డిఎస్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.


Also read : GHMC elections: పవన్ కళ్యాణ్‌ను కలవటంలేదు: బండి‌ సంజయ్


సీఎం కేసీఆర్‌కి రాష్ట్రం కంటే కేంద్రం గురించే ఎక్కువ ఆలోచన:
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ( Dubbaka bypoll result ) గురించి డిఎస్ ప్రస్తావిస్తూ.. దుబ్బాక నియోజకవర్గం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు చెందిన సొంత నియోజకవర్గాలకు ఆనుకునే ఉంటుందని... అటువంటి చోట ఇటీవల జరిగిన ఉపఎన్నికలో ప్రజా తీర్పు ఎలా ఉందో స్పష్టంగా తెలిసొచ్చిందని చెబుతూ పరోక్షంగా పార్టీపై వ్యతిరేకతకు అదే నిదర్శనం అని అన్నారు. అభివృద్ధి జరిగితే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోకపోతే కష్టమని చెప్పిన డీఎస్.. తనను టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో మర్చిపోయిందని అభిప్రాయపడ్డారు. 


Also read : GHMC elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే


Also read : GHMC elections: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే


Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు


Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి