SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు

ఎస్బీఐలో 2,000 ప్రొబేషనరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఎస్బీఐలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు గడువు ఉంది. డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2,000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. 

  • Nov 15, 2020, 12:27 PM IST
1 /7

ఎస్బీఐలో 2,000 ప్రొబేషనరీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉంది.

2 /7

ఎస్బీఐ ప్రకటించిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. లేదంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2020 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ అయ్యుండాలి.  2020 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి. వయస్సు మినహాయింపు విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

3 /7

ఎస్బీఐ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 4వ తేదీ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ కాగా 2020 డిసెంబర్ 31, 2021 జనవరి 2, 4, 5 తేదీల్లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.

4 /7

ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులకు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేష‌న్ ఫీజు OC,EWS,OBC అభ్యర్థులకు రూ.750 కాగా SC,ST, PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. 

5 /7

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం : నవంబర్ 14, 2020 ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ : డిసెంబర్ 4, 2020 ప‌రీక్ష తేదీలు : 2020 డిసెంబర్ 31, 2021 జనవరి 2, 4, 5 తేదీలలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 

6 /7

మొత్తం పోస్టుల సంఖ్య: 2000 కాగా అందులో ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్- 200, జనరల్- 810 భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉంది.  Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?  

7 /7

తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉండనుండగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి ఉన్నాయి.  Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? Also read : Use of firecrackers in Telangana: తెలంగాణలో టపాసుల విక్రయాలు, వినియోగంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు