GHMC Mayor Gadwal Vijayalakshmi Assume Office: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి నేటి ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 22న ఉదయం హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి తన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది డిసెంబర్ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ ద్వారా బీజేపీ నాయకురాలు, ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్‌రెడ్డిపై బంజారాహిల్స్ కార్పొరేటర్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) విజయం సాధించడం తెలిసిందే.


Also Read: GHMC Mayor కావాల్సిన అర్హతలు చాలా మందికి ఉన్నాయి, కానీ పదవి ఒక్కరికే సాధ్యం: CM KCR


డిప్యూటీ మేయర్‌గా తార్నక కార్పొరేటర్ మోతె శ్రీలత గెలుపొందారు. ఎంఐఎం నేతల మద్దతు కూడగట్టుకున్న టీఆర్ఎస్(TRS) పార్టీ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కించుకుంది. ఎక్స్‌అఫీషియో సభ్యులు చాలా తక్కువగా ఉన్న కారణంగా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.


Also Read: GHMC Mayor 2021: జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మీ, MIMతో ఫలించిన TRS వ్యూహాలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook