GHMC Mayor elections 2021: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల విషయంలో TRS party, MIM party మాట ఒక్కటేనని BJP ముందు నుంచి చెబుతున్న మాట నేడు జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికతో నిజమైందని బీజేపి కార్పోరేటర్స్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ మధ్య పొత్తు లేదని ఒకరిపై మరొకరు పరస్పరం ప్రత్యారోపణలు, దూషణలు చేసుకున్న ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు.. ఇవాళ ఎలా కలిసిపోయాయని బీజేపి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ల మద్దతుతో టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ Gadwala Vijaya Laxmi, మేయర్‌గా, Mothe Srilatha డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన అనంతరం బల్దియా కార్యాలయం వెలుపల బీజేపి కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధినేత CM KCR, మంత్రి కేటీఆర్, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసిలు ద్వంద వైఖరితో వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇదే విషయమై బీజేపి రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ వేర్వేరుగా పోటీ చేస్తున్నప్పటికీ, GHMC Mayor Elections లో మాత్రం ఆ రెండు పార్టీలు ఒక్కటవుతాయని బీజేపి ముందు నుంచే చెబుతూ వచ్చిందని.. ఇవాళ అదే నిజమైంది'' అని అన్నారు.
Also read : Nagarjuna Sagar: మహిళలను కుక్కలు అని సంబోధిస్తారా ? CM KCR కామెంట్స్‌పై BJP ఫైర్
ఈ సందర్భంగా ఆ రెండు పార్టీల దోస్తీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ప్రకాశ్ రెడ్డి.. '' ఒకరినొకరు పరస్పరం దూషించుకున్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కేవలం మేయర్ పదవి కోసం మళ్లీ కలిసిపోయిన తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని.. అందుకే రాబోయే రోజుల్లో GHMC లోనే కాదు... యావత్ తెలంగాణలోనూ TRS party ని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపడం ఖాయం అని హెచ్చరించారు. పదవులను దక్కించుకోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని.. GHMC Mayor Elections విషయంలోనూ అదే చేసిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
GHMC Mayor elections: TRS పార్టీది రాజకీయ వ్యభిచారం.. BJP నేతల ఘాటు వ్యాఖ్యలు
పూర్తయిన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు.
టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ Gadwala Vijaya Laxmi మేయర్‌గా, Mothe Srilatha డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక.
టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల దోస్తీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన BJP Corporators