High Tech Cheating: పోలీసుల్లో చేరేందుకు ఎం సీల్ సాయం.. పాపం ఇలా దొరికేసిందిగా!
Girl in Telangana Caught while Cheating : తెలంగాణలో ఎలా అయినా ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో ఒక యువతి చేసిన పని ఇప్పుడు ఆమెనుఅడ్డంగా బుక్కయ్యేలా చేసింది, ఆ వివరాల్లోకి వెళితే
Girl in Telangana Caught while Cheating in Police Selections: మన భారతదేశంలో ఎక్కువగా యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఉద్యోగం నోటిఫికేషన్లు పడిందే తడవుగా ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకుని ఉద్యోగం ఎలా అయినా దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఎక్కువగా పోలీసు ఉద్యోగాల మీద కూడా యువత దృష్టి పెడుతూ ఉంటారు. తాజాగా ఎలా అయినా పోలీసుగా మారాలి అనుకున్న ఒక యువతి అందుకు చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా పోలీసు నియామకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసు ఉద్యోగానికి అర్హత సాధించేందుకుగాను ఒక మహిళా అభ్యర్థి తన ఎత్తు పెంచి చూపించే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. మహబూబ్నగర్ జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మోసం చేస్తూ ఉద్యోగానికి ప్రయత్నించిన ఒక యువతిని పట్టుకున్నారు.
అసలు విషయానికి వస్తే మహబూబ్నగర్ జిల్లా స్టేడియం గ్రౌండ్లో దేహదారుడ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ అభ్యర్థుల ఎత్తు, బరువు, దేహానికి సంబంధించిన కొలతలు కొలుస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఎత్తు కొలిచే ప్రక్రియలో భాగంగా ఒక మహిళా అభ్యర్థి ఎలక్ట్రానిక్ యంత్రం ముందు నిలబడ్డారు కానీ ఆమె ఎత్తును ఆ ఎలక్ట్రానిక్ పరికరంలో ఉన్న సెన్సార్లు గుర్తించడం లేదు. ఒకటికి రెండు సార్లు చేసిన అలాగే గుర్తించక పోవడంతో ఆమె తల మీద అనుమానం వచ్చి వెంటనే తలలో చేతులు పెట్టి టెస్ట్ చేశారు.
అక్కడ ఆ సదరు అభ్యర్థి తలపై నల్లగా ఉండే ఎంసీల్ అనే మైనం అతికించుకున్నట్లుగా గుర్తించారు. తల మీద ఉబ్బెత్తుగా ఉండడంతో అది ఎత్తుగా కలిసిపోతుందని ఎత్తు ఎక్కువ చూపించేందుకు ఆ ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు సదరు మహిళా అభ్యర్థిని అనర్హురాలిగా ప్రకటించారు. పరీక్షలలో ఆధునిక సాంకేతికత ఉపయోగిస్తున్నామని చిన్న తేడా చేసిన వెంటనే గుర్తుపట్టేస్తామని సో ఇలాంటి విషయాల జోలికి వెళ్ళవద్దని ఆయన హెచ్చరించారు.
Also Read: Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయం సీజ్
Also Read: BRS Central Office: నేడు ఢిల్లీలో బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం.. మంత్రి కేటీఆర్ డుమ్మా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook