Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయం సీజ్

Telangana: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కార్యాలయంపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల అనంతరం పోలీసులు కీలక వస్తువుల్ని సీజ్ చేశారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2022, 11:01 PM IST
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయం సీజ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎన్నికల వ్యూహకర్త కార్యాలయంపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ వివరాలు మీ కోసం..

తెలంగాణ ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకమైన పోస్టులపై దాడులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న సునీల్ కార్యాలయంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న ఎస్‌కే కార్యాలయంలో ఈ దాడులు జరిగాయి. అనంతరం సైబరాబాద్ పోలీసులు కీలకమైన కంప్యూటర్ ల్యాప్‌టాప్‌లను సీజ్ చేశారు. ఈ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలతో ఈ దాడులు జరిగాయి. సోదా చేసే సమయంలో సిబ్బంది సెల్‌ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ చేయించారు. 

ఈ దాడులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. సునీల్ కార్యాలయాన్ని కుట్రపూరితంగా సీజ్ చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు షబ్బీర్ అలీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఖండించారు. ఏ విధమైన ఎఫ్ఐఆర్ లేకుండా కార్యాలయంపై దాడులు ఎలా చేస్తారని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ఈ సందర్భంగా పోలీసులతో నేతలకు వాగ్వాదం జరిగింది. సునీల్ కార్యాలయంలో ఘర్షణ నెలకొంది. 

కాంగ్రెస్ వార్‌రూమ్‌లో పోలీసుల దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాడికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లో తీసుకువెళ్తుంటే..పోలీసుల పెత్తనమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

Also read: Ys Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు రిలీఫ్, పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News