Godavari floods: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవహాంతో ప్రమాదకర స్థాయికి చేరింది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం (Water Levels) తెల్లారేసరికి అడుగుమేర పెరిగింది. ఇది శనివారం ఉదయం 6 గంటలకు 54.30 అడుగులగా ఉంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ప్రవాహం 14.32 లక్షల క్యూసెక్కులకు చేరింది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో దాని పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కొన్ని ప్రమాదకర స్థాయికి చేరడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోదావరికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ప్రియాంక విజ్ఞప్తి చేశారు. గోదావారి ఉధృతి కారణంగా ఖమ్మం, వాజేడు, చర్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తున్నది. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. దీనికి సంబంధించిన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు 11,505 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలియజేశారు. బాధితులను ఆదుకునేందుకు హెలికాప్టర్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెడీగా ఉన్నాయి. 


Also Read: Jampanna Vagu: జంపన్నవాగు మహోగ్రరూపం.. 8 మంది జలసమాధి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook