Godavari Floods: గోదావరికి 16వ తేదీ గండం.. వరద విలయమేనా... తీరంలో ఏం జరగబోతోంది?
Godavari Floods: వర్షాకాల సీజన్ లో 16వ తేదీ వస్తే గోదావరి తీర గ్రామాల వాసులు వణికిపోతున్నారు. తమకు ఏ గండం ముంచుకొస్తుందోనన్న భయంతో హడలిపోతున్నారుయ ఎందుకంటే 16వ తేదీనే గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం గోదావరికి రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది. శనివారం జూలై16వ తేదీని గోదావరిలో నీటిమట్టం 71.8 అడుగులకు చేరింది.
Godavari Floods: వర్షాకాల సీజన్ లో 16వ తేదీ వస్తే గోదావరి తీర గ్రామాల వాసులు వణికిపోతున్నారు. తమకు ఏ గండం ముంచుకొస్తుందోనన్న భయంతో హడలిపోతున్నారుయ ఎందుకంటే 16వ తేదీనే గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం గోదావరికి రికార్డ్ స్థాయిలో వరద వచ్చింది. శనివారం జూలై16వ తేదీని గోదావరిలో నీటిమట్టం 71.8 అడుగులకు చేరింది. శనివారం ఉదయం 9గంటలకు భద్రాచలంలో గోదావరి ప్రవాహం 24.30 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నీటిమట్టం 71.6కే చేరడం గోదావరి చరిత్రలోనే రెండో గరిష్టం. వరద ప్రవాహం 24 లక్షలు దాటడం కూడా రెండోసారే. గతంలో 1986 ఆగస్టు 16న భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 76.3 అడుగులకు వచ్చింది. ఇదే ఇప్పటివరకు రికార్డ్. దాదాపు 36 ఏళ్ల తర్వాత గోదావరికి మళ్లీ ఆ స్థాయిలో వరదలు వచ్చాయి. అయితే 1986లో ఆగస్టు 16నే గోదావరి నీటిమట్టం రికార్డ్ స్థాయికి చేరగా... ఈసారి కూడా జూలై16వ తేదీనే భద్రచాలం దగ్గర గోదావరి నీటిమట్టం 71.8 అడుగుల రికార్జ్ స్థాయికి చేరింది. దీంతో రెండు సార్లు 16వ తేదీనే గోదావరిలో అత్యంత ప్రమాదకరస్థాయిలో నీటిమట్టం నమోదు అయింది. దీంతో గోదావరి వరదకు 16వ తేదీకి సంబంధం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాధారణంగా గోదావరికి వరదలు జూలైలో మొదలై.. ఆగస్టులో ఉధృతమవుతాయి. గోదావరికి గతంలో భారీగా వచ్చిన వరదలన్ని ఆగస్టులోనే వచ్చాయి. కొన్నిసార్లు సెప్టెంబర్ లో వచ్చాయి. కాని జూలైలో ఎప్పుడు భారీ వరదలు రాలేదు. జులై నెలలో గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరడమే ఇదే తొలిసారి అంటున్నారు. 1950లో మాత్రమే జూలైలో భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. భద్రాచలంలో నీటిమట్టం 53 అడుగులకు చేరగానే మూడో ప్రమాద హెచ్చరిక ఇస్తారు. కాని ఈసారి ఏకంగా 72 అడుగులకు నీటిమట్టం చేరడం రికార్డే. 2006లో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. భద్రాచలం దగ్గర నీటిమట్టం 67 అడుగులు దాటింది. అయితే అప్పుడు కూడా ఆగస్టులోనే భారీ వరద వచ్చింది. గోదావరికి 1954, 1986, 1990, 2006, 2013, 2020లో భారీగా వరదలు వచ్చాయి. అవన్ని ఆగష్టు నెలలోనే వచ్చాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 2006లో 67 అడుగులకు చేరగా.. 2013లో 61 అడుగులు దాటింది. రెండేళ్ల క్రితం 2020లో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 61.6 అడుగులుగా నమోదైంది.
గోదావరిలో వరద ప్రహహం 60 అడుగులు దాటితే లంక గ్రామాలు జల దిగ్బందంలో చిక్కుకుంటాయి. ఈసాకి ఏకంగా 70 అడుగులు దాటడంతో తెలంగాణలోని భద్రాచలం, బూర్గంపాటు, చర్ల, పినపాక, అశ్వారావుపేట మండలాల్లోని వందలాది గ్రామాలు నీట మునిగాయి. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏపీలోని కోనసీమ లంక గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వందకు పైగా గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. ధవళేశ్వరం నుంచి దాదాపు 25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో గతంలో ఎప్పుడు లేనంతగా ముంపు పెరిగిందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యాంతో మరికొన్ని లంక గ్రామాలకు ముంపు వచ్చిందని అంటున్నారు. 2006లో గోదావరికి 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పుడు కోనసీమలోని రెండు చోట్ల గోదావరి గట్లకు గండిపడింది. అయినవిల్లి మండలంలోని శానపల్లిలంక, పి గన్నవరం మండంలోని మొండెపులంక వద్ద ఏటిగట్లు తెగిపోయాయి. దీంతో వరద లంక గ్రామాలను ముంచెత్తడంతో భారీగా నష్టం. ఈ సారి కూడా దాదాపు 25 లక్షల క్యూసెక్కుల వరద ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంలో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
Also Read: Godavari Floods LIVE: భద్రాచలం సేఫేనా? మరో నాలుగు గంటలు గడిస్తేనే.. పోలవరంలోనూ హై టెన్షన్
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.