Godavari river water sharing row latest updates: హైదరాబాద్: గోదావరి నది జలాల విషయంలో ఏపీ సర్కారు, తెలంగాణ సర్కారు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణపై మరోసారి సంచలన ఆరోపణలు చేస్తూ ఏపీ సర్కారు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు, కేంద్రానికి లేఖలు రాసింది. గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం ప్రాజెక్టు సహా మొత్తం ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన డిపీఆర్‌లను (Telangana projects DPRs) తెలంగాణ సర్కారు గోదావరి బోర్డు, కేంద్ర జల్ శక్తి శాఖకు సమర్పించిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఆ డీపీఆర్‌లలో అన్ని అవాస్తవాలే పేర్కొన్నారని, వాటిని ఆమోదించవద్దని విజ్ఞప్తి చేస్తూ ఏపీ సర్కారు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్రానికి రాసిన లేఖల్లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఈ ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ఏపీలోని పోలవరం ప్రాజెక్టులోకి (Polavaram project) నీటి ప్రవాహం తగ్గిపోతోందని ఏపీ సర్కారు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ నీటి జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామల రావు గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు (Godavari river management board), కేంద్రానికి వేర్వేరుగా లేఖలు రాశారు. 


Also read : TDP MP Galla Jayadev: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌తో పాటు గల్లా కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణ కేసు


రాష్ట్ర పునర్విభజన బిల్లుకు, గోదావరి నది నీటి పంపకాల విషయంలో గోదావరి జల వివాద ట్రైబ్యునల్ సిఫార్సులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నాయని ఏపీ సర్కారు ఈ లేఖల ద్వారా గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, కేంద్రం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా నీటి లభ్యతపై సరైన అంచనాలు వేసి, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో ఏ జల వివాదం లేకుండా నీటి పంపిణీపై ఒప్పందం చేసుకోవడం, లేదంటే కొత్త ట్రైబ్యునల్ నుంచి క్లారిటీ వచ్చే వరకు తెలంగాణ ఇచ్చిన డీపీఆర్‌లను పక్కనపెట్టాలని ఏపీ సర్కారు (AP govt) కేంద్రాన్ని కోరింది.


గోదావరి నీటి పంపకాల విషయంలో (Godavari river water sharing row) ఏపీ సర్కారు చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న తెలంగాణ సర్కారు ఈసారి ఎలా స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి. అలాగే, ఏపీ సర్కారు రాసిన ఈ లేఖలపై కేంద్రం, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) స్పందించే తీరు కూడా ముఖ్యమే కానుంది.


Also read : CJI NV Ramana: టీటీడీలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఊరుకోడు - సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook