Godavari river water: హైదరాబాద్: గోదావరి నది జలాల వినియోగంలో ఏపీకి అన్యాయం జరిగేలా అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్న ఏపీ వాదనలను తెలంగాణ ఖండించింది. నిన్న రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కృష్ణా రివర్ బోర్డ్ ( Krishna river board) సమావేశం ఏర్పాటు చేయగా.. ఇవాళ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ( Godavari river board) సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ సర్కారు (Telangana govt) తరపున రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఏపీ సర్కార్ ( AP govt) తరపున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ( GRMB, KRMB: తెలంగాణ సర్కారుకి గోదావరి, క్రిష్ణా రివర్ బోర్డులు షాక్ )
గోదావరి నీటి వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలపై రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకు 967.14 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారని.. అవే జలాలను ఉపయోగించుకోవడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. గోదావరి కేటాయింపుల్లో నీటిని ఎక్కడైనా వాడుకోవచ్చని ట్రైబ్యునల్ స్పష్టంగా చెప్పింది. తెలంగాణకు జరిగిన నీటి కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు చేపడుతున్నాం. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు ఏవీ చేపట్టలేదు. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని అన్నారు. గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీరు తరలిస్తున్నందున మాకు 45 టీఎంసీలు రావాలని కోరాం. డీపీఆర్‌లు ఇవ్వాలని బోర్డులు పదేపదే కోరుతున్నాయి. ప్రభుత్వ అనుమతితో ఇచ్చేందుకు తమకు ఏ ఇబ్బంది లేదని చెప్పాం. ( వాడివేడిగా కృష్ణా రివర్ బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య తేలిన లెక్కలు )
కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు కొత్తవి కావు అని గుర్తు చేస్తూ.. తెలంగాణలో అలా ప్రాజెక్టులు పూర్తి కానందున, రైతులకు న్యాయం జరగనందునే తెలంగాణ పోరాటం జరిగింది కదా అని రజత్ కుమార్ గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడి ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. అంతకుమించి కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఏవీ లేవు అని స్పష్టంచేశారు. ఈ వివాదంపై అపెక్స్ కౌన్సిల్‌ని ఆశ్రయించినప్పుడు అన్ని విషయాలను వివరిస్తాం. అదే సమయంలో పోతిరెడ్డిపాడుపై రాతపూర్వకంగా కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తామని రజత్ కుమార్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..