Badrachalam Flood: తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు తగ్గినా గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగట్ట నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ మహోగ్రంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయం ఆరు గంటలకు వరకు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 71.3 అడుగులకు చేరింది. గంటగంటకు గోదారవరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలంలో శనివారం ఉదయానికి డిశ్చార్జ్ 24.29 లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది. పోలవరం స్పీల్ వే గేట్ల నుంచి  22 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరంలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి గోదావరి పరుగులు పెడుతోంది. దవళేశ్వరంలో ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 23.10 లక్షల క్యూసెక్కులుగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భద్రాచలానికి ఎగువ నుంచి వరద క్రమంగా పెరగుతూనే ఉంది. శనివారం సాయంత్రానికి 74 అడుగలవరకు చేరి.. తర్వాత క్రమంగా తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి గోదావరకి వరద భారీగా తగ్గింది. ఎగువ  శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి అవుట్ ఫ్లో భారీగా తగ్గింది. ప్రాణహిత కాస్త శాంతించడంతో మేడిగడ్డ దగ్గర నిన్నటి పోల్చితే దాదాపు ఐదు లక్షల క్యూసెక్కుల వరద తగ్గింది. అయితే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి శుక్రవారం సాయంత్రం దాదాపు 28 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉంది. ఆ వరదంతా శనివారం మధ్యాహ్నానికి భద్రాచలం చేరనుంది. ఆ సమయంలో గోదావరి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరనుంది. తర్వాత క్రమంగా తగ్గనుంది. దీంతో శనివారం సాయంత్రం వరకు భద్రాచలంలో హై అలెర్ట్ ప్రకటించారు. భద్రాచలానికి సాయంత్రం వచ్చే గరిష్ట వరద... ఆదివారం సాయంత్రానికి ధవళేశ్వరం చేరనుంది. దీంతో పోలవరం, ధవళేశ్వరానికి మరో 48 గంటలు అత్యంత కీలకం.


గోదావరి నీటిమట్టం 71 అడుగులు దాటడంతో భద్రాచలం నీట మునిగింది. రామాలయం చుట్టూ నీళ్లే ఉన్నాయి. పట్టణంలోని దాదాపు 10 కాలనీలు పూర్తిగా జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. కొన్ని భవంతుల మూడో అంతస్తు వరకు వరద నీరు చేరింది. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలం వంతెనపై శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. బూర్గంపాటు మండల కేంద్రం మొత్తం నీట మునిగింది. దాదాపు 80 లంక గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర అభ్యర్థనతో ఆర్మీ కూడా భద్రాచలంలో సిద్ధంగా ఉంది. సహాయచర్యల కోసం హెలికాప్టర్ ను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. ప్రస్తుతానికి భద్రాచంలో క్షణంక్షణం భయంభయంగా ఉంది. మరో నాలుగైదు గంటలు గడిస్తే గండం గట్టెక్కినట్లేనని స్థానికులు భావిస్తున్నారు. శాంతించాలని గోదారమ్మకు పూజలు చేస్తున్నారు.


Read also: బౌలర్ హ్యాండ్ కర్చీఫ్ కిందపడిందని.. బ్యాటర్‌ను నాటౌట్ ఇచ్చిన అంపైర్‌! క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి  


Read also: లలిత్‌ మోదీతో సుష్మితా సేన్‌ డేటింగ్.. మాజీ విశ్వసుందరి ఆస్తుల విలువెంతో తెలుసా?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.