Gone Prakash Rao: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు. ఎప్పుడు ఏదో సంచలన వార్తతో బాంబ్ పేల్చుతుంటారు. దివంగత వైఎస్సార్ హయాంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. వైఎస్సార్ కు మద్దతుగా అప్పట్లో ఆయన తమ ప్రత్యర్థులను చీల్చిచెండాడేవాడు. అందుకే గోనేను వైఎస్సార్ ఎంతో ప్రోత్సహించారు. వైఎస్సార్ హయాంలోనే ఆర్టీసీ చైర్మెన్ వంటి కీలక పదవి ప్రకాష్ రావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు, నేతల చీకటి కోణాలకు సంబంధించిన విషయాలు గోనే దగ్గర ఉంటాయంటారు. అయితే వైఎస్సార్ తర్వాత గోనే సైలెంట్ అయ్యారు. కొన్ని రోజులు జగన్ కు మద్దతుగా తన వాయిస్ వినిపించినా తర్వాత జగన్ ను టార్గెట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటారు గోనే ప్రకాష్ రావు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న గోనే ప్రకాష్ రావు తాజా సంచలన వార్తతో బయటికి వచ్చారు. తెలంగాణలో భారీగా జరుగుతున్న చెబుతున్న గోనే.. అక్రమాల చిట్టా తయారు చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఓ మంత్రిని టార్గెట్ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.  మంత్రి బావ అంటూ గోనే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి బావ 8 కోట్ల రూపాయల ప్రాపర్టీని ఆక్రమించారని ఆరోపించారు. దర్జాగా ఆస్తిని కొల్లగొట్టినా అడిగే వారే లేరన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచకాలు బాగా పెరిగిపోయాయన్నారు గోనే ప్రకాష్ రావు. ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపేయాలని అనిపిస్తోందని  మండిపడ్డారు.


కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు అరాచకాలు పెరిగిపోవడం వలనే మావోయిస్టుల హెచ్చరికలు వచ్చాయన్నారు గోనే ప్రకాష్ రావు. మెడికల్ ఉద్యోగాల మాఫియాపై మావోయిస్టులు సీరియస్ గా ఉన్నారని.. రామగుండం, చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆక్రమాలన్ని వెలికితీస్తున్నానని చెప్పారు.  ఎమ్మెల్యేల అక్రమాలకు సంబంధించిన తాను సేకరించిన ఆధారాలను సీఎం కేసీఆర్ కు పంపిస్తానని చెప్పారు,ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చాయన్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో  మావోయిస్టులు బలహీనపడ్డారని చెప్పారు. అధికార పార్టీ నేతల అక్రమాలకు సంబంధించి గోనే ప్రకాష్ రావు చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. గోనే చేతిలో ఎవరికి మూడిందో అన్న చర్చలు సాగుతున్నాయి.


Read also: IND vs SA 2nd T20 Match: చెలరేగిపోయిన టీమిండియా.. సౌతాఫ్రికాకు కోలుకోలేని దెబ్బ


Read also: Man Carries His Wife on Shoulders: భార్యను భుజాలపై ఎత్తుకుని తిరుమల కొండపైకి.. సత్తిబాబు మామూలోడు కాదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి