Telangana government : ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనుదారులకు తెలంగాణ ప్రభుత్వం ( Telangana government) గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగులో ఉన్న మూడు డీఏల (dearness allowance) మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం మేరకు మూడింటికి కలిపి 10.01 శాతం చెల్లింపులకు అనుమతించినట్లు మంగళవారం ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. దీనివల్ల ప్రభుత్వంపై నెలనెలా రూ.260 కోట్ల అదనపు భారం పడుతుంది. పెరిగిన డీఏను ఫిబ్రవరి వేతనం/ఫించనుతో కలిపి చెల్లించే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా (Covid-19) కారణంగా రెండేళ్లుగా డీఏల చెల్లింపులో జాప్యం ఏర్పడింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడడంతో మూడు డీఏలను ఒకేసారి చెల్లించేందుకు తాజాగా క్యాబినెట్ నిర్ణయించింది. ఇదిగాక గత జులై (2021) నాటికి చెల్లించాల్సిన 2.73 శాతం డీఏ పెండింగులో (Pending DA) ఉంది. ఈ నెల పూర్తయ్యే నాటికి మరో డీఏను ప్రభుత్వం మంజూరు చేయాలి. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. పెండింగ్ డీఏల మంజూరుపై ఉద్యోగ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. డీఏల చెల్లింపు నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌కి (CM KCR) కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


Also Read: Cabinet Meeting : అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్, ఫారెస్ట్ యూనివర్సిటీకి ఆమోదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook