Gurukula Food Poison: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు చదవుతోపాటు స్కిల్స్‌ పెంపొందించుకుంటే మంచి భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. సచివాలయంలో కూర్చున్న మీరంతా భవిష్యత్‌లో ఇక్కడ అధికారులుగా చేరాలని అభిలషించారు. బాలల దినోత్సవం నవంబర్‌ 14వ తేదీన ఒక శుభవార్త వినిపిస్తానని చెప్పారు. ఫేజ్‌ 2 ఇంటిగ్రేటెడ్‌ గురుకులాలను ప్రకటిస్తామని తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR: రేవంత్‌ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు


 


డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచామని చెబుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంబరాలు చేస్తోంది. ఇప్పటికే ఒకసారి తన నివాసానికి గురుకుల విద్యార్థులను పిలిపించుకుని మాట్లాడిన రేవంత్‌ రెడ్డి తాజాగా సచివాలయానికి పిలిపించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో మధిర నియోజకవర్గానికి చెందిన గురుకుల విద్యార్థులను పిలిపించుకుని వారితో మాట్లాడారు. విద్యార్థులను పరిచయం చేసుకుని వారితో రేవంత్‌ మాట్లాడారు.


Also Read: Rahul Gandhi: బావర్చీ హోటల్లో రాహుల్‌ గాంధీ కోసం బిర్యానీ వెయిటింగ్‌.. వైరల్ వీడియో


 


అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. డైట్, కాస్మోటిక్ చార్జీలు అందులో భాగంగా పెంచాం' అని తెలిపారు. దేశ నిర్మాణంలో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని సూచించారు. సామాజిక న్యాయం అందించేందుకు ప్రభుత్వం కుల గణన సర్వే చేపడుతోందని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని వివరించారు.


'వచ్చే విద్యా సంవత్సరంలో గురుకులాల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయి' అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. సాంకేతిక నైపుణ్యంతోపాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోందని వివరించారు. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడల్లో రాణించేందుకు తాము ప్రోత్సాహ ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.


విద్యార్థులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రేవంత్‌ రెడ్డి కోరారు. 'సచివాలయం రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్ లో మీరు సచివాలయంలో అడుగు పెట్టాలి.. పరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా' అని తెలిపారు. వ్యసనాలకు బానిస కావొద్దని.. వ్యసనాలకు బానిసలుగా మారితే జీవితాలు నాశనం అవుతాయని వివరించారు. నవంబర్ 14న 15 వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం తీసుకుంటున్మని రేవంత్‌ తెలిపారు.


అక్కడ అస్వస్థత.. ఇక్కడ సంబరాలు
గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతుంటే రేవంత్‌ రెడ్డి మాత్రం గురుకులాల విద్యార్థులతో సమావేశం కావడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల విద్యార్థులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురవగా బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందించి సొంత ఖర్చులతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. తాజాగా మరో రెండు, మూడు గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాటిపై సమీక్షించడానికి తీరిక లేని రేవంత్‌ రెడ్డి గురుకుల విద్యార్థులను తన వద్దకు పిలిపించుకుని సంబరాలు చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే విద్యా శాఖపై రేవంత్‌ సమీక్ష చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి