MLA Raja Singh: గాల్లో బాణం వేస్తే కేసులు పెడతారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..
MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ నవమి శోభయాత్రలో గౌలీగూడలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత గాల్లో బాణం ఎక్కుపెడితే ఆమె మీద కేసు పెట్డడం ఏంటని అన్నారు. పక్కాగా మసీదువైపు ఎక్కుపెట్టిందని ఎలా చెప్తారంటూ కూడా రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
MLA Raja Singh Comments In Hanuman Shobhayatra At Gowliguda: దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రతిఏడాది మాదిరిగానే ఈసారి కూడా హనుమాన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరబాద్ లోని గౌలీగూడా నుంచి తాడ్ బంద్ వరకు రామ, హనుమాన్ భక్తులు శోభయాత్రగా వెళ్తుంటారు. అయితే గౌలీగూడాలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసులు అడుగడుగున రామభక్తులను అడ్డగిస్తున్నారని ఆన్నారు. ముఖ్యంగా శోభయాత్రలో హిందువులు ఎక్కువగా పాల్గొనకుండా, పోలీసులు అడ్డుపడుతున్నారని అన్నారు. అదే విధంగా.. హిందువుల పండుగలకు పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ లు తీసుకొవాలి. కానీ ముస్లింల పండుగలకు మాత్రం ఏమాత్రం అడ్డుచెప్పకుండా, అన్నింటికి అడ్డుపడతారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
అంతేకాకుండా.. హనుమ శోభయాత్రలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ ఎంపీఅభ్యర్థిపై మాధవీలతపై కేసు పెట్టడంపై కూడా, ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. గాల్లో బాణం ఎక్కుపెడితే.. అది మసీదువైపు ఎక్కుపెట్టినట్లు ఎలా చెప్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్ చెప్పినట్లు పోలీసులుతల ఆడిస్తున్నారని అన్నారు. ఎంపీ అసదుద్దీన్ బీఫ్ జిందాబాద్ అంటే.. తాను పోర్క్ జిందాబాద్ అంటానంటూ కూడా వ్యాఖ్యలుచేశారు. ఎంపీ అసదుద్దీన్ చెప్పిన విధంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ లోక్ సభ ఎన్నికలలో 17 కు, 16 స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు. అంతే కాకుండా.. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడినుంచైన ప్రచారంకు రెడీ అన్నారు. కిషన్ రెడ్డికి, తనకు ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవన్నారు. హనుమాన్ జయంతి తర్వాత అధిష్టానం ఆదేశాల మేరకు ఎక్కడి నుంచైన పోటీకి సిద్ధమన్నారు. పార్టీ ఆదేశాలను సమర్థవంతంగా పాటిస్తానని, నాయకులు ఎవరితోకూడా తనకు బేధాభిప్రాయాలు లేవని ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు.
Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..
ఇదిలా ఉండగా.. హనుమాన్ శోభాయాత్రలో భక్తులంతా ఎంతో జోష్ గా పాల్గొంటున్నారు. గౌలీగుడా నుంచి తాడ్ బండ్ వరకు జై శ్రీరామ్ అంటూ బైక్ ల మీద, నడుచుకుంటూ భక్తులే పాదయాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమని అనుకున్నామని, కాంగ్రెస్ కూడా అలాంటి పనులను కంటీన్యూ చేస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter