Tamilisai Soundararajan: మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి గవర్నర్ తమిళిసై.. ఆ స్థానం నుంచి పోటీ..!
Lok Sabha Elections 2024: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి పొలిటికల్‌గా యాక్టివ్‌గా కానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ లెవల్లో వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Lok Sabha Elections 2024: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు నాడు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 2019లో తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఎక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడని తమిళిసై.. ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళనాడు నుంచి ఇప్పటికి మూడుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై.. నాలుగోసారి ఎంపీగా పోటీ చేసీ గెలుపు దిశగా క్యాడర్‌ని రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. 2006లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు.
Also Read: Dil Raju: రేవంత్ రెడ్డి దగ్గరికి దిల్ రాజు.. ఆశిష్ పెళ్లికార్డ్ అందజేసిన ఫ్యామిలీ
తమిళనాడు PCC మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె అయిన తమిళిసై.. 1999 లో బీజేపీలో చేరారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.. అధ్యక్షురాలిగా.. జాతీయ కార్యదర్శిగా పదవులు నిర్వర్తించి.. పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రామనాథపురం స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరచెన్నై నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయారు. 2011, 2019 ఎన్నికల్లోనూ తమిళిసైకు ఓటమి తప్పలేదు. అనంతరం ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమిళిసై కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతల ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్‌కి కొరకరాని కొయ్యగా మారారు. పలు బిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీల విషయంలోను తనదైన మార్కును చూపించారు. దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్నికి, రాజ్‌భవన్‌కి చాలా గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్‌ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో మటుకు సఖ్యతతో ఉంటున్నారు. గత 5 సంవత్సరాలుగా గవర్నర్‌గా అంతగా తన మార్కుని చూపించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు.
తమిళనాడులో బీజేపీకి ఉనికే లేని పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరి ఒక గుర్తింపు తీసుకువచ్చిన తమిళసై.. పార్టీని క్షేత్ర స్థాయినుంచి బలోపేతం చేశారు. తన స్వతాహాగా రాజకీయాల్లోకి వచ్చి మామూలు కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎదిగారు. తమిళనాడు నుంచి ఎంపీగా పోటీచేసి బీజేపీకి ఉనికిని తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. ఇటీవల తమిళనాడులో రాజకీయ విమర్శలు కూడా చేయడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం ఊపందుకుంది.
Also Read: Chandrababu Naidu: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సై.. ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి